iDreamPost
android-app
ios-app

TDPకి గట్టిగా ఎదురుదెబ్బ.. యనమల కృష్ణుడు రాజీనామా!

ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, ఓ మాజీ మంత్రి సోదరుడు పార్టీకి రాజీనామా చేశాడు. తనకు టికెట్ కేటాయించక పోవడంతో గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, ఓ మాజీ మంత్రి సోదరుడు పార్టీకి రాజీనామా చేశాడు. తనకు టికెట్ కేటాయించక పోవడంతో గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

TDPకి గట్టిగా ఎదురుదెబ్బ.. యనమల కృష్ణుడు రాజీనామా!

ఏపీలో పొలిటికల్ హీట్ తీవ్ర స్థాయిలో ఉంది. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఇక్కడ రాజరకీయం చాలా రసవరత్తరంగా మారింది. ముఖ్యంగా ప్రధాన పార్టీల్లోకి ఆయారాం గయారాంలు ఎక్కువయ్యారు. అన్ని పార్టీల్లోనూ వచ్చే వాళ్లు వస్తుంటే.. పోయే వాళ్లు పోతున్నారు. ఇక అధికార వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంటూ, టీడీపీకి మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీలోని కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కేశినేని నాని, నల్లగంట్ల స్వామిదాస్ వంటి కీలక నేతలు టీడీపీ వీడారు. తాజాగా టీడీపీ మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

టీడీపీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు పార్టీకి గట్టి షాకిచ్చాడు. టీడీపీ కి ఆయన రాజీనామా చేశారు. యనమల రామకృష్ణుడు టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజవర్గం నుంచి ఆయన రెండు సార్లు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈయనపై దాడిశెట్టి రాజా రెండు సార్లు విజయం సాధించారు. తునిలో 2014,2019లో వైసీపీనే విజయం సాధించింది. రెండు సార్లు ఓడిపోయిన తాను 2024లో పోటీ చేసి..గెలవాలనే యనమల కృష్ణుడు భావించారు. అయితే ఆయనకు ఈ సారి పార్టీ అధినాయకత్వం టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన సోదరుడైన యనమల రామకృష్ణుడి కూతురు దివ్యకు టిక్కెట్ కేటాయించింది.

ఇక ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న టికెట్ దక్కడపోవడంతో గతకొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అలానే పార్టీ కార్యక్రమాలకు కూడా యనమల కృష్ణుడు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు పార్టీలో చేరతారని తెలుస్తోంది. దీంతో తుని నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలినట్లేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి టీడీపీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఇక తుని నియోజవర్గం విషయానికి వస్తే.. 2004 లో టీడీపీ ఇక్కడ గెలిచింది. ఆతరువాత వరుసగా మూడు సార్లు ఇక్కడ ఓటమి పాలైంది. 2009 కాంగ్రెస్ తునిలో విజయం సాధించింది. అనంతరం 2014,2019లో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. ఈ రెండు పర్యాయములు దాటిశెట్టి రాజా యనమల కృష్ణుడిపై విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం కోసం వైసీపీ వ్యూహాలు రచిస్తుంటే.. ఎలాగైన గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. అసలకే..తుని నియోజకవర్గంలో టీడీపీ చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి తరుణంలో కీలక నేత పార్టీకీ రాజీనామా చేయడంతో గట్టి ఎదురు దెబ్బ తగినట్లు అయింది.