iDreamPost
android-app
ios-app

తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు!

Sahitya Akademi Awards 2023: బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. ఈ సారి తెలుగు రచయితనకు ఈ పురష్కారం దక్కింది.

Sahitya Akademi Awards 2023: బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. ఈ సారి తెలుగు రచయితనకు ఈ పురష్కారం దక్కింది.

తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు!

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏటా ఈ పురష్కారాలను కేంద్రం ప్రకటిస్తుంది. అలానే 2023 ఏడాదికిగాను ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. తెలుగు రచయితాను ఏడాది కేంద్ర పురస్కారం లభించింది.  సుప్రసిద్ధ తెలుగు రచయిత తల్లావఝల పతంజలి శాస్త్రికి 2023 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు’ కథా సంపుటికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ చిన్న కథల సంకలనం విశేష ప్రాచుర్యం పొందింది. పతంజలి శాస్త్రి  1945లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. కాలేజీల్లో లెక్చరర్ గానూ, ప్రిన్సిపాల్ గానూ పనిచేశారు. ఆయన పర్యావరణవేత్తగానూ మంచి గుర్తింపు ఉంది. జాతీయస్థాయిలో మొత్తం 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కాయి.

కేంద్ర సాహిత్య అకడామీ పురష్కారాల ప్రకటనకు బేతవోలు రామబ్రహ్మం, పాపినేని శివశంకర్, దార్ల వెంకటేశ్వరరావు జ్యూరీగా వ్యవహరించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో 24 భారతీయ భాషలకు చెందిన పురస్కార గ్రహీతలను ప్రకటించారు. ఈసారి కేవలం 5 భాషల్లో కథా సంపుటాలు మాత్రమే అవార్డులు గెలుచుకున్నాయి. వాటిలో ఒకటి పంతజలి శాస్త్రి రాసిన తెలుగు సంపుటి కావడం గమనార్హం. ఎక్కువ భాషల్లో కవిత్వానికే అకాడమీ పురస్కారం మొగ్గు చూపింది. పంతాంజలి శాస్త్రి  ఏపీలోని  మడ అడవుల రక్షణ కోసం చాలా పోరాటం చేశారు. అలానే అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలలో జరిగిన సదస్సులకు పర్యావరణ కార్యకర్తగా హాజరయ్యారు.

Central Sahitya Akademi Award for Telugu writer

దక్షిణ భారతదేశ చరిత్ర మీద, దేవాలయాల వాస్తు మీద పతంజలి శాస్త్రికి విశేష పరిజ్ఞానం ఉంది. పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడం పట్ల పలువులు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇక తనకు కేంద్ర సాహిత్య అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  తనకు సాహిత్య వ్యాసంగం గుర్తింపు కోసమో, పురస్కారాల కోసమో కాదని, పర్యావరణం, సాహిత్యం తన జీవితం, తన రచన అని తెలిపారు. ‘రామేశ్వరం కాకులు’ దేశంలోనే గౌరవప్రదమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం సంతోషం ఉందని ఆయన అన్నారు.  మరి.. మన తెలుగు రచయితకు కేంద్ర అవార్డు దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.