iDreamPost
android-app
ios-app

ఈమె మాములు లేడీ కాదు.. కిలేడీ! ఏం చేసిందో తెలిస్తే.. షాకే!

East Godavari News: నేటి కాలంలో కొందరు మహిళల్లో నేర ప్రవృత్తి బాగా పెరుగుతుంది. కొన్ని రకలా నేరాల్లో పలుమార్లు జైలుకు వెళ్లిన వారి బుద్ది మారడం లేదు. ఆ తరహాలోనే తాజాగా ఓ మహిళ చేసిన పని చేస్తే.. షాకవుతారు.

East Godavari News: నేటి కాలంలో కొందరు మహిళల్లో నేర ప్రవృత్తి బాగా పెరుగుతుంది. కొన్ని రకలా నేరాల్లో పలుమార్లు జైలుకు వెళ్లిన వారి బుద్ది మారడం లేదు. ఆ తరహాలోనే తాజాగా ఓ మహిళ చేసిన పని చేస్తే.. షాకవుతారు.

ఈమె మాములు లేడీ కాదు.. కిలేడీ! ఏం చేసిందో తెలిస్తే.. షాకే!

సాధారణంగా మహిళలు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం. కారణంగా కుటుంబ వ్యవస్థలో వారి పాత్ర ఎంతో కీలకమైనది. అంతేకాక ఎంతో ఓర్పుతో, సహనంతో కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తుంటారు. మరికొందరు ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటారు. అయితే కొందరు మహిళలు మాత్రం అపకీర్తీ తెచ్చే పనులు చేస్తుంటారు. మంచితనం ముసుగులో మోసాలకు పాల్పడుతూ..మిగిలిన మహిళపై కూడా అపనమ్మకం కలిగేలా చేస్తుంటారు. తాజాగా ఓ మహిళ చేసిన పని అచ్చం అలానే ఉంది.  వృద్ధులనే టార్గెట్ చేసుకుని వారి  ఇళ్లలో అందిన కాడికి బంగారం, నగదు దోచుకెళ్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ లోని  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంగర గ్రామానికి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్‌ బుజ్జి వివాహం జరిగింది. అయితే కొంతకాలం క్రితం భర్త మరణించాడు. ప్రస్తుతం ఆమె రాజమండ్రి మండలంలోని బొమ్మూరులో నివాసం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో వృద్ధులు ఉండే ఇళ్లనే లక్ష్యగా డబ్బులు చోరీ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే వృద్ధులతో పరిచయం పెంచుకుని వారి ఇళ్లలో పని మనిషిగా చేరుతుంది.

ఇక ఆ వృద్ధులకు ఆమెపై నమ్మకం కుదిరిన తరువాత తన అసలు పని ప్రారంభిస్తుంది.  వాళ్లకు అన్నం, ప్రసాదం, కూల్ డ్రింక్స్ వంటి పానీయాల్లో మత్తు మాత్రలను కలిపి వారిని నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. ఇక వృద్దులు నిద్రలోకి జారుకున్న తరువాత వారి ఒంటిపై నగలతో పాటు ఇంట్లోని బంగారం, నగదు దోచుకుపోతుంది. ఇలా దొంగతన చేసిన బంగారాన్ని పలు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకర్ల వద్ద తనఖా పెట్టి నగదుగా మార్చుకుంటుంది.  ఈక్రమంలోనే ఆమెపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజులుగా గోదావరి  తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ రకమైన చోరీలపై పోలీసులు నిఘపెట్టారు.

అంతేకాక ఈ అపరిచిత వ్యక్తితో జాగ్రత్త అంటూ బుజ్జి ఫోటోను సైతం విడుదల చేశారు. ఈ  ఆగష్టు 18న ఆ నిందితురాలు పోలీసులకు దొరికింది. ఇప్పటికే ఆమె పలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించింది. ఈ క్రమంలోనే 2021 జైలు నుంచి విడుదలై బయటకు వచ్చింది. అలా జైలు నుంచి వచ్చిన తరువాత కూడా ఆమె బుద్ధి మారదలేదు. తిరిగి అదే తరహా చోరీలకు పాల్పడుతోంది.  ఆరు కేసులకు సంబంధించిన 273.8 గ్రాముల బంగారు నగలను నిందితురాలి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు  పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిబ్బందిని అభినందించారు. అపరిచిత వ్యక్తులను అసలు నమ్మోద్దని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.