ATMలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త

డబ్బులు తీసేందుకు ఏటీఎం సెంటర్ కు వెళుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. మీ కళ్లెదుటే..మీకు తెలియకుండా మీ ఖాతాలో డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు ఇదొక నయా దందాగా మారింది. అదెలా ఎలా అంటే..?

డబ్బులు తీసేందుకు ఏటీఎం సెంటర్ కు వెళుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. మీ కళ్లెదుటే..మీకు తెలియకుండా మీ ఖాతాలో డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు ఇదొక నయా దందాగా మారింది. అదెలా ఎలా అంటే..?

ఏటీఎం నుంచి డబ్బులు రావడం లేదని పక్కనున్న వ్యక్తికి కార్డ్ ఇస్తే అంతే సంగతులు.. అవును మీరు విన్నది నిజమే.. జేబులు కత్తిరించకుండానే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. దొంగతనాలు చేసే పని లేకుండా ఏ సమయంలో అయినా ఈజీ‌గా దుడ్డును కొల్లగొడుతున్నారు. అమాయకత్వం అనే ఆయుధాన్ని వాడి.. వారి కళ్ల ముందే డబ్బులు కాజేస్తున్నారు. ఏటీఎం కార్డుదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఈ మాయ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ , సరైన అవగాహన లేని ప్రజలు ఇలాంటి నేరాలకు బాధితులు అవుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ఏటీఎం కార్డులను మార్చి నగదును దోచేసే నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

ఏటీఎం కార్డును మార్చి నగదు చోరీ

అనంతపురం జిల్లా గుత్తి పట్టణములో ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకు (APGPB) ఏటీఎంలో మునీంద్ర అనే మహిళ ఏటీఎం కార్డును ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తి 25వేల రూపాయల నగదును అపహరించాడు. అదే ఎలా అంటే.. ముందుగా ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లింది మహిళ. డబ్బులు రావడం లేదని పక్కన ఉన్న వ్యక్తికి చూపించి వాటిని డ్రా చేసి ఇవ్వమని అడిగింది. అదే అదునుగా తీసుకున్న ఆ అపరిచితుడు రెండు, మూడు సార్లు ఆమె ఏటీఎం కార్డును తీసుకొని.. ఏదో ప్రయత్నిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి..చివరకు ఇది పనిచేయడం లేదని నమ్మ బలికాడు. అదే ఆవకాశంతో ఆమెను మాటల్లో పెట్టాడు. జాగ్రత్తగా ఆమె దగ్గర ఉన్న ఏటీఎం కార్డును కాజేసి , తన దగ్గర ఉన్న మరో ఏటీఎం కార్డును తీసి ఆమెకి ఇచ్చాడు.

ఆ యువకుడు చేసిన మోసాన్ని గ్రహించని ఆ అమాయకురాలు మోసగాడు ఇచ్చిన ఏటీఎం కార్డుని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత దుండగడు ఏటీఎం కార్డుతో రూ. 25 వేలను డ్రా చేసుకొని పరార్ అయ్యాడు. ఇంటికి వెళ్లిన మహిళ ఆకౌంట్ లో డబ్బులు డ్రా అయిన విషయాన్ని గ్రహించి ఖంగుతిన్నది. మోసపోయానని తెలుసుకున్న మహిళ గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంలో మహిళను మోసం చేసి.. కార్డు మార్చి డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show comments