ఈ దంపతులు రూ.200కోట్లు ఎలా కొట్టేశారు! ఈ కేసు ఫుల్ స్టోరీ!

పిల్లల చదువుకు, పెళ్లికి, ఇల్లు కొనుక్కుందామని కొంత డబ్బును దాచుకోవాలని అనుకుంటారు. సామాన్యుడికి ఒక్కసారే లక్షలు రావు కనుక.. కొంచెం కొంచెం డబ్బును కూడేసి.. చిట్టీల రూపంలో దాచుకుంటూ ఉంటారు. అయితే ఇదే మోసగాళ్లకు పెట్టుబడిగా మారింది.

పిల్లల చదువుకు, పెళ్లికి, ఇల్లు కొనుక్కుందామని కొంత డబ్బును దాచుకోవాలని అనుకుంటారు. సామాన్యుడికి ఒక్కసారే లక్షలు రావు కనుక.. కొంచెం కొంచెం డబ్బును కూడేసి.. చిట్టీల రూపంలో దాచుకుంటూ ఉంటారు. అయితే ఇదే మోసగాళ్లకు పెట్టుబడిగా మారింది.

కష్టపడి రూపాయి రూపాయి పోగేసి.. సేవ్ చేయాలని అనుకుంటాడు పేద, మధ్యతరగతి మానవుడు. తిని తినక కొంత డబ్బును వెనకేసుకుంటాడు. పిల్లల చదువుకో లేక అత్యవసరాలకు పనికి వస్తుందని కాస్త కూడబెడుతుంటాడు. అయితే బ్యాంకులో పెడితే..లాభం ఏమీ ఉండదని భావించి.. దాచిన డబ్బులను ఎవరికో ఒకరికి అప్పు రూపంలో ఇస్తుంటాడు. లేదా చీటీల రూపంలో డబ్బులు కడుతుంటాడు. వారి ఆశే కొంపలకు ముప్పు తెచ్చిపెడుతుంది. చిట్టీల పేరుతో లక్షలు, కోట్లను వసూలు చేసి.. ఆ తర్వాత పెట్టా బేడా సర్దేస్తున్నారు వ్యక్తులు, సంస్థలు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగినా కూడా పేరాశ.. సగటు మానవుడ్ని మోసపోయేలా చేస్తుంది.

తాజాగా హైదరాబాద్‌లో ఓ చిట్ ఫండ్ కంపెనీ.. రూ. 200 కోట్ల ప్రజా డబ్బును తీసుకుని ఉడాయించింది. దీంతో చిట్టీలు కట్టిన ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. 510 మందిని పైగా మోసం చేసింది సదరు సంస్థ. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణీ బాల, మేక నేతాజీ భార్యా భర్తలు. సైదాబాద్‌లో నివసిస్తున్నారు. వాణీ హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (టెస్కాబ్)లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త మేకా నేతాజీ, కొడుకు శ్రీ హర్షలు శ్రీ ప్రియంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ స్థాపించారు. ఈ క్రమంలో వాణి బాల.. తన బ్యాంకుకు డిపాజిట్లు చేసేందుకు వచ్చిన కస్టమర్లతో మాటలు కలిపి.. ఎక్కువ వడ్డీ ఆశ చూపించి తమ సంస్థలో చీటీలు కట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. ఈ క్రమంలోనే తన ఆఫీసుకు దగ్గరలోనే మరో ఆఫీసును కూడా తెరిపించింది వాణీ బాల.

తన వద్దకు వచ్చిన కస్టమర్లను అక్కడకు వెళ్లేలా ప్లాన్ చేసేది. అంతేకాకుండా తనతో వర్క్ చేసే అధికారులు, డీసీసీబీల సిబ్బంది, స్థానికులు,బంధువులు.. ఇలా తెలిసిన వారి చేత చిట్టీలు కట్టించింది. అలా 517 మంది నుండి రూ. 200 కోట్లు కాజేశారు. అయితే వాణీ బాల మరికొన్ని రోజుల్లో రిటైర్డ్ అవుతుండగా.. ఉన్నపళంగా సెలవులు పెట్టింది. అంతలో కంపెనీ సంస్థ కూడా మూత పడటంతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. అయితే ఇద్దరు ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో బోర్డు తిప్పేశారని అర్థం చేసుకున్న కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఇందులో ఐదు వందల మందిని పైగా మోసం చేసి.. ఆ డబ్బులతో ఉడాయించారు. కాగా, దాచుకున్న డబ్బులు పోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. ఈ మోసం గురించి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో వాణీ బాలను విధుల్లో నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Show comments