Pawan Kalyan, AP Elections 2024: తన పార్టీ గుర్తుకు ఓటు వేయని పవన్‌ కళ్యాణ్‌! ఎందుకీ దుస్థితి

Pawan Kalyan, AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ, తన సొంత పార్టీ గుర్తు గాజు గ్లాసుకు మాత్రమ వేయలేకపోయారు. ఆయన దుస్థితి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Pawan Kalyan, AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ, తన సొంత పార్టీ గుర్తు గాజు గ్లాసుకు మాత్రమ వేయలేకపోయారు. ఆయన దుస్థితి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఏపీలో ఓట్ల పండుగ ఘనంగా జరిగింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు పొటెత్తారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఓటు అనే ఆయుధాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా.. పోలింగ్‌ ప్రశాంతగా జరిగింది. అయితే.. ఈ ఎన్నికల్లో వీరావేశంతో రెచ్చిపోతూ.. అర్థంపర్థంలేని వ్యాఖ్యలెన్నో చేసిన పవన్‌ కళ్యాణ్‌.. తాజాగా పోలింగ్‌ డే రోజు కూడా నవ్వులపాలయ్యారు. పవన్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. పవన్‌ తన ఓటు తనకు వేసుకోలేకపోయారు. పోనీ వేరే చోట ఓటు హక్కు వినియోగించుకున్నా.. కనీసం ఆయన పార్టీ గుర్తు గాజు గ్లాసుకు కూడా ఓటు వేయలేకపోయారు పవన్‌. మరి ఆయనకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును మంగళగిరిలోని పోలింగ్ కేందంలో వినియోగించుకున్నారు. ఆయన తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. అయితే, పిఠాపురం నుంచి ఎన్డీయే బలపర్చిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ బరిలో దిగిన విషయం తెలిసిందే. కానీ, ఆయన ఓటు మంగళగిరి నియోజకవర్గంలో ఉండటం, చివరి నిమిషంలో పిఠాపురం స్థానం నుంచి పోటీకి సిద్ధం అవ్వడంతో ఓటు మార్పు సాధ్యం కాలేదు. దీంతో ఆయన మంగళగిరిలోనే ఓటు వేయాల్సి వచ్చింది. మంగళగిరిలో ఎన్డీయే కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ బరిలో నిలిచారు. సహజంగా ఎవరి పార్టీకి వాళ్లు వేసుకుంటారు కాబట్టి.. మంగళగిరిలో జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి, గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థి లేకపోవడంతో.. రెండు కూడా సైకిల్‌ గుర్తుకే పవన్‌ ఓటు వేయాల్సి వచ్చింది.

అయితే.. తన సొంత పార్టీ గుర్తుకు ఓటు వేయలేని దుస్థితి పవన్‌ కళ్యాణ్‌ తన చేతులతో తనే తెచ్చుకున్నాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అనవసరంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్‌.. ఏదో ముష్టి తీసుకున్నట్లు కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు తీసుకున్నారు. రాష్ట్రాన్ని పరిపాలించాలని పెట్టిన పార్టీ.. కనీసం 50, 60 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంత దారుణం పరిస్థితి మరే పార్టీ అధినేతకు కూడా వచ్చి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం తన పార్టీ గుర్తు ఒక్క ఓటు కూడా వేసుకోలేని దుస్థితి ఒక్క పవన్‌ కళ్యాణ్‌కు మాత్రమే వచ్చిందని, అది ఆయన ఆనాలోచిత నిర్ణయాల వల్లే తలెత్తిన దీన స్థితి అంటూ రాజకీయ పండితులు జాలి చూపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments