తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్‌.. ఈ మూడు రోజులు బయటకు వెళ్తే డేంజరే

IMD Alert: ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మూడు రోజుల పాటు బయటకు వెళ్తే డేంజరే అంటున్నారు. ఆ వివరాలు..

IMD Alert: ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మూడు రోజుల పాటు బయటకు వెళ్తే డేంజరే అంటున్నారు. ఆ వివరాలు..

ఈ ఏడాది చరిత్రలోనే అత్యంత వేడి సంవతర్సరంగా రికార్డు సృష్టించింది. ఇక ఈ ఏడాది మార్చి నెల నుంచే భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మార్చి మొదటి వారి నుంచే భానుడు భగభగలు మొదలయ్యాయి. ఉదయం 8 గంటలు దాటాకా.. భయటకు రావలంటేనే జనాలు భయపడి పోతున్నారు. ఎండలు తీవ్రంగా పెరగడంతో.. జనాల ఇబ్బంది మాములుగా లేదు. వేడితో పాటు వడగాడ్పులు కూడా తీవ్రంగా ఉండటంతో.. ఈ సమస్య. భానుడి భగభగలతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి ప్రజలు కూల్‌ డ్రింక్‌లు, కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా.. గురువారం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 3.9 డిగ్రీలు ఎక్కువ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఇక గత కొన్ని రోజులుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. పగలు, రాత్రి తేడా లేకుండా ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. మండే ఎండలు, వడగాడ్పులతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని.. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఒకపక్క.. గురువారం ఏపీలో సుమారు 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఇక రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక శుక్రవారం ఏపీలో 174 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో ఇలా ఉండగా.. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రామగుండం, భద్రచాలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, వృద్ధులు, గర్భీణీలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక తెలంగాణలో మిశ్రమ వాతావరణం ఉండనుంది అంటున్నారు. ఓ వైపు రాష్ట్రంలో మండే ఎండలతో పాటు.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కనుక ఈ మూడు రోజుల పాటు వృద్దులు, గర్భిణిలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు

Show comments