APకి వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు!

  • Author singhj Published - 08:46 AM, Thu - 9 November 23

ఆంధ్రప్రదేశ్​ను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని అప్​డేట్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్​ను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని అప్​డేట్ ఇచ్చింది.

  • Author singhj Published - 08:46 AM, Thu - 9 November 23

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ద్రోణి ఎఫెక్ట్ కారణంగా ఏపీలో వానలు కంటిన్యూగా పడుతున్నాయి. గత ఐద్రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. రాయలసీమ, కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురువారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసినా మిగిలిన చోట్ల జల్లులు లేదా మబ్బుగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కోస్తాలోని పలు జిల్లాల్లో బుధవారం కుండపోత వానలు పడ్డాయి.

బుధవారం నాడు ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో 81.6 మిల్లీ మీటర్లు, ప్రకాశం జిల్లా ముండ్లమూరులో 70.2 మిల్లీ మీటర్లు, బాపట్ల జిల్లాలోని అద్దంకిలో 111.2 మిల్లీ మీటర్లు, నెల్లూరు జిల్లాలోని కావలిలో 55.6 మిల్లీ మీటర్లు, కర్నూలు జిల్లాలోని గూడూరులో 43.4 మిల్లీ మీటర్లు, కర్నూలు టౌన్​లో 43 మిల్లీ మీటర్లు, పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో 39.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురంలో 38.6 మిల్లీ మీటర్లు, కర్నూలు జిల్లాలోని ఆస్పరిలో 34.6 మిల్లీ మీటర్లు, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో 37.2 మిల్లీ మీటర్లు, తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో 33 మిల్లీ మీటర్లు, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో 31.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

అలాగే పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 30.4 మిల్లీ మీటర్లు, బాపట్ల జిల్లాలోని రేపల్లెలో 30.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వానలతో అన్నదాతలకు కొంతమేర రిలీఫ్ దక్కిందని అంటున్నారు. పంటలు ఎండిపోతున్న టైమ్​లో వర్షాలతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. అంతేగాక గత వారం వరకు ఎండలు ఒక రేంజ్​లో మండిపోవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఈ వానల వల్ల వాతావరణం చల్లబడింది. అలాగే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో రాత్రిళ్లు చలి వాతావరణం ఉంటోంది. ఈ వానలు ఏపీకి ఉపశమనమని అంటున్నారు.

ఇదీ చదవండి: ఆ వ్యక్తులపై అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవు: AP CID

Show comments