iDreamPost

ఆ వ్యక్తులపై అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవు: AP CID

సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఏపీ సీఐడీ. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరించారు

సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఏపీ సీఐడీ. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరించారు

ఆ వ్యక్తులపై అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవు: AP CID

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దీని ద్వారా మంచి ఎంత ఉందో, చెడు అంతే ఉందని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. మరికొందరు తమకు నచ్చనివారిపై  అభ్యతకరమైన పోస్టులు పెడుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. అత్యున్నత పదవిలో ఉన్న వారిపై, మహిళలపై దారుణమైన పోస్టులు పెడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఏపీ సీఐడీ. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరించారు.

బుధవారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా సోషల్ మీడియా పోస్టుల గురించి పలు కీలక అంశాలను వెల్లడించారు. కొందరు  ముఖ్యమంత్రి, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారని తెలిపారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటుని హెచ్చరించారు. నకిలీ ఖాతాలను పట్టుకోలేమని అనుకోవడం సరికాదని. అలాంటి ఫేక్‌ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కూడా కఠిన చర్యలుంటాయన్నారు.

హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టామని  ఏపీ సీఐడీ పేర్కొంది. ఈ మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారని, మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై  కఠిన చర్యలుంటాయని తెలిపారు. అంతేకాక ప్రతిపక్ష నేతలతో సహా ఎవరి మీద అయినా సరే సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోమని, కచ్చితంగా చర్యలు  ఉంటాయని స్పష్టం చేశారాయన్నారు.

కిందటి ఏడాది 1450 పోస్టులు, ఈ ఏడాది 2164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించామన్నారు. న్యాయ వ్యవస్ధపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. అవసరమైతే అలాంటి వారి ఆస్తులు సీజ్ చేయడానికి వెనకాడమని పేర్కొన్నారు. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపుల కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించామని అన్నారు. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని సీఐడీ సూచించింది.

సామాజిక మాధ్యమాల ఖాతాలను వ్యక్తిగత దూషణలకు వినియోగించొద్దని హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగ్‌లు 19 మందికి నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశామన్నారు. సీఎం, ఆయన కుటుంబ సభ్యులని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్న ఖాతం గుర్తించామని సోషల్ మీడియా పేరుతో పరిధి దాటి అసభ్యకర సందేశాలు పెడితే కఠినంగా వ్యవహరిస్తామ ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. మరి.. ఏపీ సీఐడీ చేసిన కీలక సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి