రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను టాలీవుడ్ ఇండస్ట్రీకి అందించాడు. ఇక ఆయన తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల తరచూ ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు తీస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలు ఏపీ రాజకీయంపై తెరకెక్కించాడు. తాజాగా వ్యూహం పేరుతో మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోనన్నాయి.
‘వ్యూహం’ సినిమా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరణం దగ్గర నుంచి మొదలవుతుందని దర్శకుడు ఆర్జీవి తెలిపారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి.. ఎన్నికలకు ముందే విడుదల చేస్తామన్ని తెలిపారు. వైఎస్సార్ మరణం తరువాత జరిగిన పరిణామాలు, ఎవరెవరు ఏ ఏ వ్యూహాలు పన్నారో.. ఈ చిత్రం చూపిస్తామని ఆర్జీవీ అన్నారు. ఈచిత్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి పాత్రకూడా ఉంటుందని చెప్పారు. ఎవరేమి సినిమాలు తీసినా తనకు అనవసరమని అన్నారు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటుందని ఆర్జీవీ తెలిపారు. ‘వ్యూహం’ చిత్ర షూటింగ్ విజయవాడ వద్ద కృష్ణానది పరిసరాల్లో ఆదివారం జరిగింది. తాడేపల్లి, ప్రకాశం బ్యారేజి పరిసరాల్లో వ్యూహం చిత్రంలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ సినిమాలో చూపిస్తున్నట్లు తెలిపారు. తాను జగన్ కు అభిమానని, అయితే ఎవరిపైనా కోపం, ద్వేషం వంటివి లేవని చెప్పారు. తీసే సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా ఉన్నారు.. అంతే తప్పా తన వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చంద్రాబాబు పిలిచి అడిగినా డైరెక్షన్ చేయనని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఆగష్టు 15వ తేదీన విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీపై షూటింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. వ్యూహం సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదంవండి: మా పథకాలు అవసరం లేదని చంద్రబాబు చెప్పగలరా?: సజ్జల