iDreamPost

మా పథకాలు అవసరం లేదని చంద్రబాబు చెప్పగలరా?: సజ్జల

మా పథకాలు అవసరం లేదని చంద్రబాబు చెప్పగలరా?: సజ్జల

ఏపీలో రాజకీయం చాలా హాట్ హాట్ గా ఉంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. ఈ  వేడి మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో అధికార, విపక్షలు మాటల యుద్ధాన్ని తారస్థాయికి తీసుకెళ్తున్నాయి. అవినీతి పాలన అంటూ ప్రతి పక్షాలు విమర్శిస్తుండగా, తమది ప్రజా సంక్షేమ పాలన అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ప్రధాన చంద్రబాబు పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర అవుతున్నారు. అతడు తన స్వార్థం కోసం ఎన్ని దారుణాలకైనా తెగబడతాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా  తాజాగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు అవసరం లేదని చెప్పగలరా? అంటూ చంద్రబాబును ప్రశ్నించాడు.

సోమవారం సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏపీకి పట్టిన శని అని,  ఆయన  ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని సజ్జల అన్నారు. ఇంకా సజ్జల మాట్లాడుతూ..”చంద్రబాబు ప్రజలను పిచ్చి వాళ్లని అనుకుంటున్నారు. అప్పుడు వద్దన్న సీబీఐ ఇప్పుడు కావాలంటున్నారు.  పవన్ కల్యాణ్ కు అవసరమైన సదుపాయాలను చంద్రబాబు  అందిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ రిషి కొండలో విన్యాసాలు చేశారు. తన యజమాని అయినా చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ మాట్లాడుతున్నారు.

పవన్ అహకారంతో వ్యవహరిస్తున్నారు. ఇక వీరిద్దరు కలిసి ప్రభుత్వంపై పద్దథి ప్రకారం బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతున్నారు. చంద్రబాబు..తమకు చట్టాలు , రాజ్యాంగ వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వారు చేసే తప్పులను ప్రశ్నిస్తే మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.  పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులు  చేశారు. పోలీసులు సంయమనం పాటించడంతో పెను ముప్పు తప్పింది. ప్రచారం కోసం చంద్రబాబు అరాచకం సృష్టించారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా జరుగుతోంది.

మ్యానిఫెస్టోలోని 98 శాతం పథకాలను అమలు చేశారు. అలానే 90 శాతం మంది ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎలాటిం అవినీతికి తావులేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. మా ప్రభుత్వ పాలనపై మాట్లాడే అంశాలే చంద్రబాబుకు లేవు.  చంద్రబాబు.. తన హయాంలో అమలు చేసిన ఒక్క మంచి పథకమైనా ఉందా?. ప్రస్తుతం అమలువుతున్న పథకాలు అవసరం లేదని చంద్రబాబు చెప్పగలరా?” అని చంద్రబాబును సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. మరి.. సజ్జల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పవన్ కామెంట్స్ పై అంబటి సీరియస్.. వాళ్లే దండుపాళ్యం బ్యాచ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి