ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త.. సిరిమానోత్సవం తేదీలు ఫిక్స్‌

ఉత్తరాంధ్ర వాసుల  ఆరాధ్య దైవం, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే భక్తులకు ఓ శుభవార్త అందింది. తాజాగా అమ్మవారి సిరిమానోత్సవం జాతర తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది.

ఉత్తరాంధ్ర వాసుల  ఆరాధ్య దైవం, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే భక్తులకు ఓ శుభవార్త అందింది. తాజాగా అమ్మవారి సిరిమానోత్సవం జాతర తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది.

ఉత్తరాంధ్ర వాసుల  ఆరాధ్య దైవం, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటరనే విషయం తెలిసిందే. కాగా, ఈ వేడుకలను తరించుకునేందుకు చుట్టు ప్రక్కల జిల్లాలోని ప్రజలు మాత్రమే కాకుండా.. పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకొని ఆ తల్లి చల్లటి అనుగ్రహంను పొందుతారు. మరీ అంతటి ఘనమైన ఈ ఉత్సవాల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు  ఎప్పుడెప్పుడా అని తెగా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  ఈ క్రమంలోనే తాజాగా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది.  మరీ, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర తేదీలను తాజాగా ఆలయ కమిటీ ప్రకటించింది. అయితే ఈ ఉత్సవాల  షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 15న సిరిమానోత్సవం జరగనుంది. అలాగే అక్టోబర్ 22 న తెప్పోత్సవం, అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవంతో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర ముగుస్తుందని ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రకటించారు.

శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రత్యేకతలు

ఇకపోతే ఈ సిరిమానోత్సవానికి కనీసం నెలరోజుల ముందే సిరిమాను చెట్టు ఎక్కుడుందనే విషయం స్వయనే అమ్మవారే తెలియజేయడం అక్కడ అనవాయితీ. దాని ప్రకరమే అక్కడికి వెళ్లి ఆ చెట్టును సేకరిస్తారు. ఆ తర్వాత వడ్రంగులు ఈ చింతచెట్టును సిరిమానుగా తయారుచేస్తారు. అయితే ఈ సిరిమానుపై కూర్చుని పూజారి ప్రజలకు, రాజ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. మరోవైపు సిరిమానోత్సవంలో రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. సిరిమానును తయారుచేసే సమయంలోనే.. ఈ రథాలను కూడా తయారుచేస్తారు.

అయితే ఉత్సవం రోజున సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ వద్ద నుంచి కోట వరకూ మూడుసార్లు తిప్పుతారు. ఈ సమయంలో విజయనగరంలోని రాజకుటుంబాలకు చెందిన వారు,  ప్రముఖులు కోటబురుజు దగ్గర కూర్చుని అమ్మను దర్శించుకుంటారు. అలాగే ఆ  ఉత్సవాన్ని చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.

Show comments