Tirupathi Rao
Tirupathi Rao
సాధారణంగా సముద్రతీరం అనగానే.. ఒడ్డుకు కొన్ని చిత్ర విచిత్రమైన వస్తువులు కొట్టుకొని వస్తుంటాయి. జాలర్ల వలలో అప్పుడప్పుడు వింత వస్తువులు చిక్కుతుంటాయి. కొన్నిసార్లు పురాతన వస్తువులు కొట్టుకు రావడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటారు. అయితే తాజాగా విశాఖపట్నం వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ విచిత్రమైన పెట్టె కొట్టుకు రావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అసలు ఆ పెట్టెలో ఏముంది అంటూ అంతా ఎదురుచూశారు. పోలీసులు, అధికారులు తీరానికి చేరుకుని ఆ పెట్టెను తెరిచారు. అది చూసిన అందరూ షాకయ్యారు.
విశాఖ వైఎంసీ తీరానికి శుక్రవారం రాత్రి ఒక చెక్క పెట్టె కొట్టుకుని వచ్చింది. అది గమనించిన పర్యాటకులు, మత్స్యకారులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆ పెట్టెను పరిశీలించారు. తర్వాత ఆర్కియాలజీ విభాగానికి కూడా సమాచారాన్ని అందించారు. పెట్టె భారీగా ఉండటంతో ప్రొక్లైయిన్ సాయంతో పెట్టెను ఒడ్డుకు చేర్చారు. బాంబు స్క్వాడ్ కూడా బీచ్ కు చేరుకుని పెట్టెను పరిశీలించారు. ఆ పెట్టెలో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని తేల్చుకున్నాక దానిని ఓపెన్ చేశారు. రెండు ప్రొక్లైయిన్ల సాయంతో ఆ పెట్టెను పగలగొట్టారు.
అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. అది పెట్టె కాదు. మొత్తం చెక్కలను ఒక పెట్టె తరహాలో ఏర్పాటు చేశారు. అది అంత బరువు ఉండటానికి కారణం అవన్నీ చెక్కలు కావడంతో అంత బరువు ఉంది. దానిని ఓడల్లో ఏదైనా బరువుల కోసం వాడుకునేవారికి భావిస్తున్నారు. అది బ్రిటీష్ కాలంనాటి పెట్టెగా కొందరు, పురాతన పెట్టె కావడంతో అందులో ఏదైనా విలువ వస్తువులు ఉన్నాయా? అని ఎదురుచూసిన అందరికీ నిరాశే ఎదురైంది. అది కేవలం చెక్కలు కావడంలో స్థానికులు కూడా నిరాశగా వెనుతిరిగారు. ఆ పెట్టెలో ఏముంది అని అనే ఉత్కంఠకు తెర పడింది. మరి ఈ చెక్కలు ఒడ్డుకు కొట్టుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
గ్రేటర్ తీరానికి కొట్టుకొచ్చిన పెట్టె, ఎదో షిప్పు నుండి జారీ పడి ఉంటుందని ప్రధమిక అంచనా.#Vizag #UANow pic.twitter.com/MvAgxbFFZK
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 30, 2023