విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ మంచి మనస్సు.. రూ.14 లక్షల విరాళాలు!

Visakhapatnam Collector: కొత్త ఏడాది వేడుక‌ల్లో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ ఔదార్యాన్ని చాటుకున్నారు. గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించారు. తన నెల జీతం మొత్తాన్ని నిరుపేదలు కోసం కేటాయించారు.

Visakhapatnam Collector: కొత్త ఏడాది వేడుక‌ల్లో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ ఔదార్యాన్ని చాటుకున్నారు. గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించారు. తన నెల జీతం మొత్తాన్ని నిరుపేదలు కోసం కేటాయించారు.

ఈ సమాజంలో మనిషికి మనిషి సాయం చేయడం అనేది ప్రధానమైనది. అలా సాయం చేయడానికి కూడా పెద్ద మనస్సు ఉండాలి. చాలా తక్కువ మంది మాత్రమే దానధర్మాలు, సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలా సమాజానికి సేవ చేయడంలోనే వారు ఆనందాన్ని పొందుతుంటారు. అలాంటి వారిలో అన్ని వర్గాల వ్యక్తులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఔదార్యానికి  అందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన నెల జీతాన్ని జిల్లా సహాయ నిధికి అందజేశారు. అంతేకాక నలుగురికి ఆదర్శంగా నిలిచి.. భారీ విరాళం వచ్చేందుకు మార్గదర్శకులు అయ్యారు. మరి.. ఈ మనసున్న కలెక్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

విశాఖపట్నం జిల్లాకు డా.ఎ. మల్లికార్జున  కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తనదైన పరిపాలనతో జిల్లాలో మంచి గుర్తింపు సంపాదించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు. దీంతో ప్రజల్లో విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ అంటే  మంచి గుర్తింపు ఉంది. అలానే తాజాగా ఆయన చేసిన మరో మంచి పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా కలెక్టర్ మ‌ల్లిఖార్జున ఔదార్యాన్ని చాటుకున్నారు. అంతేకాక గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించారు. తన నెల జీతం మొత్తాన్ని నిరుపేదలు, నిస్సహాయుల కోసం కేటాయించారు. ఆయన సాయం చేయడమే కాకుండా ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కలెక్టరే ముందుకొచ్చి సాయం చేయడమే కాకుండా పిలుపు నివ్వడంతో భారీగా విరాళం వచ్చింది. కలెక్టర్ పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు అంద‌రూ విరాళం ఇచ్చారు. నిరుపేదలు, నిరాశ్రయుల సహాయం కొర‌కు ఏర్పాటు చేసిన సంజీవనీ నిధిని ఏర్పాటు చేశారు.

ఆ డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్‌కు సోమ‌వారం స్వచ్ఛందంగా రూ. 14,22,368 విరాళాలుగా అంద‌జేసి జిల్లాలోని ఉద్యోగులందరూ తమ ఉదారతను చాటుకున్నారు. ఇక డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ కు స్వయంగా జిల్లా కలెక్టర్ డా. మల్లిఖార్జున నే తన ఒక నెల జీతం లక్ష పదివేల రూపాయలు  అంద‌జేసి త‌న పెద్ద మ‌నుసును చాటుకున్నారు. దీంతో మిగతా ఉద్యోగులు కూడా ఉద్యమంలా ముందుకు వచ్చారు. ఇలా అందరూ కలిసి రూ. 14,22,368 విరాళంగా ఇచ్చారు. నిరుపేదలు, నిరాశ్రయులను ఆదుకొనేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఓ మంచి కార్యక్రమం చేపట్టారు. సంజీవని నిధి పేరుతో 2023 జనవరి 1వ తేదీ డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ తొలిరోజున దీన్ని కలెక్టర్ ప్రారంభించారు.

న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు తన వద్దకు వచ్చేవారు స్వీట్లు, పండ్లు, బొకేలు తేవద్దని, శక్తిమేర సంజీవని నిధికి విరాళమివ్వాలని అప్పట్లోనే కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇప్పుడే కాకుండా గత ఏడాది కూడా తన వంతుగా ఒకనెల వేతనం రూ.1.10లక్షలు ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. 2023లో కూడా కలెక్టర్ పిలుపునకు ఉద్యోగులు, అధికారులు స్పందించారు. ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా రూ.10 లక్షల 98 వేలు జమ అయ్యాయి. ఈసారి అది 14 లక్షల 22 వేలకు చేరింది. మరి.. విశాఖ జిల్లా కలెక్టర్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments