Dharani
విశాఖపట్నంలో ఓ యువకుడు అర్థరాత్రి నానా హంగామా సృష్టించాడు. హోర్డింగ్ ఎక్కి.. చేతిలో కత్తి పట్టుకుని.. దగ్గరకు వస్తే చస్తానని బెదిరించాడు. ఎందుకంటే..
విశాఖపట్నంలో ఓ యువకుడు అర్థరాత్రి నానా హంగామా సృష్టించాడు. హోర్డింగ్ ఎక్కి.. చేతిలో కత్తి పట్టుకుని.. దగ్గరకు వస్తే చస్తానని బెదిరించాడు. ఎందుకంటే..
Dharani
నిరసన తెలపడానికి అనేక మార్గాలుంటాయి. రోడ్డు మీద బైఠాయించడం, నిరాహార దీక్ష చేయడం, అధికారులు, నేతలను అడ్డగించడం.. మోసం చేసిన వారి ఇంటి ముందు బైఠాయించడం వంటివి చేస్తుంటారు. ఇక నేటి కాలంలో వీటన్నింటిని కాదనుకుని.. సెల్ టవర్లు, హోర్డింగ్‌లు, బిల్డింగ్‌ల మీదకు ఎక్కి నిరసన తెలుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా వైజాగ్‌లో ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. రాత్రి సమయంలో పోలీసులకు చుక్కలు చూపాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆ యువకుడికి రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. మరి ఇంతలోనే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.. అతడికి వచ్చిన సమస్య ఏంటి అనేది తెలియాలంటే..
విశాఖ బీచ్‌రోడ్డులో ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. తన దగ్గరకు రావాలని చూస్తే.. కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. చేతిలో కత్తి పట్టుకుని మరీ బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని.. సదరు యువకుడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. కానీ అతడు మాత్రం వారి మాట వినలేదు.. యువకుడిని కిందకు దించేసరికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చినట్లైంది. ఇంతకు ఆ యువకుడు ఎందుకు ఇలాంటి పని చేశాడు అంటే.. భార్య కోసం. అవును రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఆమె పుట్టింటి వారు అతడి వద్ద నుంచి తీసుకెళ్లిపోయారు. దాంతో తన భార్యను తనకు అప్పగించాలంటూ ఆ యువకుడు ఇలా హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు ఐటీఐ చదివాడు. ఈ క్రమంలో అతడు తన కాలేజీలో సూపర్ జూనియర్‌గా ఉన్న యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమలను ఇరు పెద్దలు అంగీకరించలేదు. దాంతో రెండు నెలల క్రితం సింహాచలం వెళ్లి.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో యువతి తండ్రి.. తన కుమార్తె కనిపించకుండా పోయిందంటూ.. పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో యువతి అనారోగ్యం పాలైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోయారు.
ఆ తర్వాత యువతిని తీసుకుని తమ స్వగ్రామానికి వెళ్లిపోయారు. చంద్రశేఖర్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా అతడి భార్య, అత్తమామలు కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో మనస్థాపానికి గురైన చంద్రశేఖర్ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. బీచ్ రోడ్‌లోని హోర్డింగ్ పైకి ఎక్కేసాడు. చేతిలో కత్తి పట్టుకొని బెదిరించాడు. ఎవరైనా తనను రక్షించాలని ప్రయత్నిస్తే.. కత్తితో గొంతు కోసుకొని దూకేస్తానని హల్చల్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. యువకుడిని కిందకు దిగాలని కోరారు. పోలసీఉలు ఎంత నచ్చచెప్పినా అతడు వినలేదు. చివరకు కౌన్సిలింగ్ చేసి నాలుగు గంటలపాటు శ్రమించి ఎలాగోలా యువకుడిని కిందకు దింపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.