iDreamPost
android-app
ios-app

పురోహితుడిని వేధించిన కుర్రాళ్లకు తగిన శాస్తి చేసిన గ్రామ పెద్దలు!

Priest Viral Video Issue: ప్రస్తుతం సమాజంలో కొన్ని కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. అలా అవ్వడం వల్ల ఆ సమస్య కూడా త్వరగా తీరుతోంది. ఇటీవల ఓ పురోహితుడి వైరల్ వీడియో విషయం కూడా ఇప్పుడు సుఖాంతమైంది.

Priest Viral Video Issue: ప్రస్తుతం సమాజంలో కొన్ని కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. అలా అవ్వడం వల్ల ఆ సమస్య కూడా త్వరగా తీరుతోంది. ఇటీవల ఓ పురోహితుడి వైరల్ వీడియో విషయం కూడా ఇప్పుడు సుఖాంతమైంది.

పురోహితుడిని వేధించిన కుర్రాళ్లకు తగిన శాస్తి చేసిన గ్రామ పెద్దలు!

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే.. పెళ్లి జరిపిస్తున్న పురోహితుడిని కొందరు కుర్రాళ్లు వేధించారు. నిజానికి మొదట ఆ వీడియో అంతా క్రియేటెడ్ అనకున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడం మాత్రమే కాకుండా నెటిజన్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా ఉంది. ఆఖరికి సెలబ్రిటీలు కూడా ఆ వీడియోపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిన కోన వెంకట్ ఇది మంచి పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అది తప్పంటూ వారించారు. పురోహితులకు తగిన గౌరవం ఇవ్వాలంటూ తెలిపారు. అలాగే ఇప్పుడు ఈ ఘటనలో ఆ ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్పారు.

ఒక పురోహితుడు చక్కగా కొత్త జంటకు వివాహం జరిపిస్తున్నారు. శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ ఇరువురిని అగ్ని సాక్షిగా ఒకటి చేస్తున్నారు. అలాంటి తరుణంలో పెళ్లికి వచ్చిన కొందరు ఆకతాయిలు ఆ పురోహితుడిని గేళి చేయడం ప్రారంభించారు. నెత్తి మీద ఖాళీ సంచి వేశారు. ఆ తర్వాత మీద ఎరుపు రంగు నీళ్లు పోశారు. ఆయన సహనంతో ఆటలాడుకున్నారు. చివరికి ఆయన సహనం కోల్పోయి నేను ఈ పెళ్లి జరిపించను అంటూ మధ్యలోనే లేచి వెళ్లిపోయేదాకా తీసుకెళ్లారు. అక్కడున్న పెద్దలు అలాంటివి చేయద్దు అంటూ వారిచినా కూడా ఆ కుర్రాళ్లు వినకపోగా ఇంకా ఎక్కువ చేశారు.

ఈ ఘటన పిఠాపురం మండలంలో జరిగింది. ఆ తర్వాత పురోహితులు అంతా కలిసి ఆ కుటుంబాన్ని కలిసి వివరణ కూడా తీసుకున్నారు. ఇలాంటి పద్ధతిని సహించేది లేదని గట్టిగా చెప్పారు. ఆ కుటుంబం తాము పెళ్లి పనుల్లో హడావుడిగా ఉండి అసలు ఏం జరిగుతుందో కూడా పట్టించుకునే పరిస్థితి లేదని.. అయ్యగారిని కావాలని అలా చేయలేదు అని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ ఘటనలో ఆకతాయిలను గుర్తించడమే కాకుండా వారికి తగిన బుద్ధి కూడా చెప్పారు. ఈ పంచాయితీ ఇప్పుడు గ్రామ పెద్దలకు చేరింది. వారు పురోహితుడిని.. ఆ కుటుంబాన్ని, ఆకతాయిలను పిలిపించి పంచాయితీ పెట్టారు. ఆ సందర్భంగా పురోహితుడు తాను ఇకపై పెళ్లిళ్లు చేయించ దల్చుకోవడం లేదు అంటూ వ్యాఖ్యానించారు.

ఇలాంటివి జరగకూడదు.. ఇకపై జరగవు అని అంతా తీర్మానం చేయాలని కోరారు. ఏదో ఆచారం పేరుతో పెళ్లి జరిపించే పంతులుని ఇలా అవహేళన చేయడం, ఆట పట్టిచడం సరి కాదంటూ వారించారు. ఆ గ్రామ పెద్దలు పురోహితుడికి ఇకపై ఇలాంటివి జరగవు అని హామీ ఇచ్చారు. అలాగే ఆ కుర్రాళ్లకు గట్టిగా నాలుగు తగిలించి పురోహితుడి కాళ్లపై పడేశారు. తమ ప్రవర్తన సమర్థించదగింది కాదని.. పురోహితుడి కాళ్లపై పడి క్షమాపణలు చెప్పుకున్నారు. ఇకపై ఇలాంటివి చేయమంటూ మాటిచ్చారు. ప్రస్తుతం ఈ వివాహం ఇక్కడితో సమసి పోయిందనే అంతా భావిస్తున్నారు. ఆన్ లైన్ లో ఈ వీడియో వైరల్ కావడంతో పురోహితుడికి క్షమాపణ చెప్పించడంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.