iDreamPost
android-app
ios-app

అమెరికాలో ఏపీ వైద్య విద్యార్థిని మరణం.. కారణం ఇదే..!

  • Published Dec 21, 2023 | 9:05 AM Updated Updated Dec 21, 2023 | 9:05 AM

ఇటీవల ఉన్నత విద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్లిన యువత పలు కారణాల వల్ల మృత్యుఒడిలోకి చేరుతున్నారు. దీంతో తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కన్నీరు మున్నీరవుతున్నారు.

ఇటీవల ఉన్నత విద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్లిన యువత పలు కారణాల వల్ల మృత్యుఒడిలోకి చేరుతున్నారు. దీంతో తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కన్నీరు మున్నీరవుతున్నారు.

అమెరికాలో ఏపీ వైద్య విద్యార్థిని మరణం.. కారణం ఇదే..!

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి సమాజంలో గొప్ప పొజీషన్లో ఉండాలని భావిస్తుంటారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో రాణించాంటే ఉన్నత విద్య అవసరం. అందుకే తమ పిల్లలను ఎంత ఖర్చయినా సరే భరించి గొప్ప చదువులు చదివించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఉన్న విద్య కోసం విదేశాలకు పంపిస్తున్నారు. ఇటీవల విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులను మృత్యువు వెంబడిస్తుంది. ఎన్నో ఆశలతో ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు పలు కారణాల వల్ల అర్ధాంతరంగా కన్నుమూస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లిన ఓ తెలుగు యువతి అమెరికాలో కన్నుమూసింది. ఆమె మృత్యువుకి కారణం ఏంటీ? పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలో వైద్య విద్యనభ్యసించడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువతి ఆశలు ఆవిరి అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఏపీకి చెందిన యువతి కన్నుమూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహిరా నాజ్ (22) ఫిజియోథెరపీ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికాకు ఈ ఏడాది ఆగస్టు లో వెళ్లింది. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న కారులో హఠాత్తుగా గ్యాస్ లీక్ అయ్యింది. అప్పటికీ డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో కారు డ్రైవర్ తో పాటు జహీరా నాజ్ కూడా స్పృహతప్పిపోయింది. ఇది గమనించిన కొంతమంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే జహీరా చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు.

ఈ విషయాన్ని జహీరా నాజ్ స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ వార్త విన్న తర్వాత విజయవాడలో జహీరా కుటుంబ సభ్యులు ఒక్కసారే షాక్ కి గురయ్యారు. ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న తమ బిడ్డ హఠాత్తుగా కన్నుమూయడం జీర్ణించుకోలేకపోయారు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కూతురు గొప్ప చదువులు చుదువుకొని పది మందికి సేవ చేస్తుందని భావించాం.. కానీ ఇలా అర్ధాంతరంగా చనిపోతుందని ఊహించలేకపోయాం అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. జహీరా మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విద్యార్థిని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.