iDreamPost
android-app
ios-app

తెల్లరేషన్ కార్డు ఉన్న యువతకు గుడ్ న్యూస్.. నెలకు మంచి అదాయం!

నేటికాలంలో మధ్యతరగతి వారికి రేషన్ కార్డు అనేది ఓ ఆస్తి లాంటిది. కారణం..దీని వల్లన అనేక ఉపయోగాలు ఉన్నాయి. తాజాగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఇప్పుడో ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

నేటికాలంలో మధ్యతరగతి వారికి రేషన్ కార్డు అనేది ఓ ఆస్తి లాంటిది. కారణం..దీని వల్లన అనేక ఉపయోగాలు ఉన్నాయి. తాజాగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఇప్పుడో ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

తెల్లరేషన్ కార్డు ఉన్న యువతకు గుడ్ న్యూస్.. నెలకు మంచి అదాయం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అందిస్తుంటాయి. అయితే సర్కార్ అందించే స్కీమ్స్ కి తెల్ల రేషన్ కార్డు అనేది ప్రమాణికం కానుంది. అందుకే మధ్య తరగతికి చెందిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా  ఉంటుంది. తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్నవారికి తరచు ఏదో ఒక శుభవార్త వస్తునే ఉంటుంది. ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉన్న యువతకు పలు అవకాశాలు వస్తుంటాయి. ముఖ్యంగా వివిధ సంస్థలు తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి స్వచ్ఛందంగా పలు రకాల శిక్షణలు ఇస్తుంటాయి. తాజాగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఇప్పుడో ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అయితే ఇది కేవలం రెండు జిల్లాలకు చెందిన వారికి మాత్రమే. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నేటికాలంలో మధ్యతరగతి వారికి రేషన్ కార్డు అనేది ఓ ఆస్తి లాంటిది. కారణం..దీని వల్లన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను అందుకోవడంలో ఈ రేషన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. అలానే ప్రభుత్వం స్కీమ్స్ తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ట్రైనింగ్ అందిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ అయినా యూనియన్ బ్యాంక్ ఓ గుడ్ న్యూస్ వినిపించింది. తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఫ్రీగా కంప్యూటర్ శిక్షణ అందివ్వనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు యూనియన్ బ్యాంక్ ఈ అవకాశం ఉంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతకు యూనియన్ బ్యాంక్ మంచి అవకాశాన్ని కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ  సంస్థ ఉచితంగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వనుంది. అయితే రేషన్ కార్డు కలిగిన యువత మాత్రమే ఈ శిక్షణ తీసుకునేందుకు అర్హులు.  ఇక ఈ శిక్షణా తరగతులు జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అలా దాదాపు నెల రోజుల పాటు ఈ శిక్షణ శిబిరం కొనసాగుతోంది. ట్రైనింగ్‌లో భాగంగా కంప్యూటర్ డెస్క్‌టాప్ పబ్లిషింగ్‌ లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామీణ యువత  అందరూ ఉపయోగించుకోవాలని యూనియన్ బ్యాంక్ సంస్థ డైరెక్టర్ పీ.సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రైనింగ్ పిరియడ్ జరిగే 30 రోజుల పాటు రోజూ భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా రవాణ ఛార్జీలు కూడా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ శిక్షణలో పాల్గొన్నాలని ఆసక్తి కలగవారికి కొన్ని అర్హతలు ఉండాలి. వారు చిత్తూరు జిల్లా వాసులై ఉండాలి. అలానే తెల్లరేషన్ కార్డుకు కలిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అయ్యి ఉండాలి. అంతేకాక వయోపరిమితి అనేది 19 నుంచి 45 ఏళ్ల మధ్యమాత్రమే ఉండాలి. అలా అర్హతలు కలిగిన మహిళలు, పురుషులు ఈ ఉచిత శిక్షణ లో పాల్గొన వచ్చు. పదో తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోలతో సంప్రదించాలని యూనియన్ బ్యాంక్  అధికారులు సూచించారు. ఈ నెల రోజుల శిక్షణ పూర్తైన తర్వాత సర్టిఫికేట్ కూడా అందించనున్నారు. మొత్తంగా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కోర్సు అనంతరం మంచి ఉద్యోగం పొందవచ్చుని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి