iDreamPost
android-app
ios-app

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సొంతంగా సేవ చేసే అవకాశం!

TTD: తిరుమలకు వెళ్లిన భక్తులు టీటీడీ పాలకమండలి అనేక సదుపాయాలు అందిస్తోంది. దర్శనం, వసతి, అన్న ప్రసాద వితరణ వంటి విషయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. తాజాగా శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం కల్పిస్తోంది.

TTD: తిరుమలకు వెళ్లిన భక్తులు టీటీడీ పాలకమండలి అనేక సదుపాయాలు అందిస్తోంది. దర్శనం, వసతి, అన్న ప్రసాద వితరణ వంటి విషయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. తాజాగా శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం కల్పిస్తోంది.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సొంతంగా సేవ చేసే  అవకాశం!

ఆంధప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరపతి ఒకటి. ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. దేశ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చి స్వామివారి కటాక్ష కోసం తపిస్తుంటారు. ఎంతో శ్రమించి..స్వామివారి దర్శనం అందుకున్న తరువాత ఆ ప్రాంగణంలో గడుపుతుంటారు. ఇక శ్రీవారి సేవల విషయంలో టీటీడీ భక్తులకు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతుంది. తాజాగా కూడా టీటీడీ శ్రీవారి భక్తులకు ఓ అద్భుత అవకాశం కల్పించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తిరుమలకు వెళ్లిన భక్తులు టీటీడీ పాలకమండలి అనేక సదుపాయాలు కల్పిస్తుంది. దర్శనం, వసతి, అన్న ప్రసాద వితరణ వంటి విషయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ అన్న ప్రసాదం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో చూస్తుంటారు. శ్రీవారి దర్శనం పూర్తైన తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి.. భక్తులు తరిస్తుంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదాన సేవలు అందిస్తోంది. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా నిత్యం భక్తులకు ఉచితంగా అన్నదానం కార్యాక్రమం నిర్వహిస్తోంది. మరోవైపు అన్నప్రసాదాలు అందించేందుకు భక్తులకు కూడా టీటీడీ అవకాశం కల్పిస్తుంది. శ్రీవెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం అందించండం ద్వారా ఈ ఆ సేవ భాగ్యాన్ని పొందొచ్చు.

ఇలా స్వామి వారి ట్రస్టుకు విరాళం అందించడం ద్వారా ఒకరోజు శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నం వడ్డించే సౌకర్యం కల్పిస్తోంది. ఒక రోజు విరాళ పథకాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ప్రారంభించింది. ఒకరోజు అన్నదానం చేయాలనుకునే భక్తులు 38 లక్షల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 15 లక్షలు, రాత్రి భోజనం కోసం మరో 15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒకరోజు అన్నదాన వితరణ కోసం డబ్బులు చెల్లించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అలానే విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.

ప్రస్తుతం తిరుమలలో పలు కేంద్రాల్లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ప్రాంగణంలో భోజనం అందిస్తున్నారు. అలానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2లోని అన్ని కంపార్టుమెంట్లు, క్యూలైన్లు అన్నప్రసాదం అందిస్తోన్నారు. అలానే పీఎసీ-2లో ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే తిరుపతిలో కూడా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు కేంద్రలో అన్నప్రసాద వితరణ జరగుతోంది. తిరుచానూరు అన్నప్రసాద భవనంలో ఉచితంగా భోజనం అందించడం జరుగుతోందని టీటీడీ తెలిపింది.