iDreamPost
android-app
ios-app

శ్రీవారి భక్తులు శుభవార్త.. అక్కడ కూడా దర్శన టికెట్లు, కౌంటర్ ఏర్పాటు!

TTD News: శ్రీవారి దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి.. నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. టీటీడీ శ్రీవారి భక్తులకు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా మరో తీపికబురు అందించింది.

TTD News: శ్రీవారి దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి.. నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. టీటీడీ శ్రీవారి భక్తులకు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా మరో తీపికబురు అందించింది.

శ్రీవారి భక్తులు శుభవార్త.. అక్కడ కూడా దర్శన టికెట్లు, కౌంటర్ ఏర్పాటు!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల  శ్రీవారి దర్శనానికి దేశంతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుంచి.. నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. తిరుమలోని క్యూలైన్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి.  భారీ సంఖ్యలో స్వామివారి దర్శనం, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొంటారు. శ్రీవారి సన్నిధిలో భక్తులు స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశం కూడా ఉంది.  ఇది ఇలా ఉంటే శ్రీవారి దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే టీటీడీ  ఈవో జే శ్యామలరావు శ్రీవారి భక్తులకు ఓ తీపి కబురు చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

గురువారం తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో జే శ్యామల రావు డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు.ఈ క్రమంలోనే ఆ యన భక్తుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇదే సమయంలో టీటీడీ ఈవో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టైం స్లాట్ టోకెన్లు వారానికి 1.47 లక్షలు జారీ చేస్తున్నామన్నారు. అలానే  అలిపిరి నుంచి విజిలెన్స్, అటవీశాఖ అధికారుల కొన్ని సూచనలు ఉన్నాయని.. త్వరలోనే చర్చించి …అలిపిరి మార్గంలోనే శ్రీవారి దర్శన టోకెన్స్ జారీ చేసేలా చూస్తామని ఆయన తెలిపారు. అలాగే శ్రీవాణి టికెట్స్ 1000కి పరిమితం చేస్తామని తెలిపారు. గతంలో పోలిస్తే లడ్డూ ప్రసాదం నాణ్యత పెరిగిందని.. త్వరలో తిరుమలలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముడి సరుకు టెస్ట్ చేయడానికి ఓ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని.. ఇప్పటికే మొబైల్ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చామని ఆయన గుర్తు చేశారు.

అలానే తిరుమలలో దళారుల ఆటలకు చెక్ పెట్టేలే యూఐడీఏఐ అధికారులతో చర్చలు నిర్వహించమాని ఆయన తెలిపారు. అదే విధంగా తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇక్కడి వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని అన్నారు. తిరుమల నడక మార్గంలో చేపట్టాల్సిన చర్యలపై వైల్డ్ లైఫ్ కమిటీ మార్గనిర్దేశాలు పాటిస్తామని ఈవో అన్నారు. యూఐడీఏఐ సర్వర్ ఇష్యూ రాకుండా చూసుకుంటామని భక్తులకు హామీ ఇచ్చారు. ఆధార్ సర్వీసులను వినియోగించడంలో ఎలాంటి చట్టపరమైన అవరోధాలు లేవన్నారు. మొత్తంగా అలిపి మార్గంలో కూడా టోకెన్స్ జారీ చేస్తామని చెప్పడంతో శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.