Nidhan
కోరిన కోరికలు తీర్చే ఏడుకొండల వెంకటేశ్వరుడ్ని దగ్గర నుంచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ వీఐపీ దర్శనం చేసుకునే వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అయితే ఇక మీదట సామాన్య భక్తులకూ ఈ అవకాశం లభించనుంది.
కోరిన కోరికలు తీర్చే ఏడుకొండల వెంకటేశ్వరుడ్ని దగ్గర నుంచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ వీఐపీ దర్శనం చేసుకునే వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అయితే ఇక మీదట సామాన్య భక్తులకూ ఈ అవకాశం లభించనుంది.
Nidhan
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. దూరం, సమయాన్ని లెక్క చేయకుండా వెంకన్న దర్శనం కోసం కొండ మీదకు చేరుకుంటారు. అయితే స్వామి వారిని చూసేందుకు క్షణ కాలం మాత్రమే అవకాశం ఉంటుంది. భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు గనుక శ్రీవారిని ఎక్కువ సేపు చూసేందుకు వీలుండదు. అయితే క్షణ కాలమే చూసినా భక్తులు తరించిపోతుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. కోరిన కోరికలు తీర్చే ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడ్ని దగ్గర నుంచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ వీఐపీ దర్శనం చేసుకునే వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అయితే ఇక మీదట సామాన్య భక్తులకూ ఈ అవకాశం లభించనుంది.
సామాన్య భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలో డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్తుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు ఈవో. భక్తులు అడిగిన పలు క్వశ్చన్స్కు ఆయన ఆన్సర్స్ ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఉన్న పలు సమస్యలను భక్తులు తమ దృష్టికి తీసుకొచ్చారని.. వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్ దర్శనం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇన్నాళ్లూ ఆర్జిత సేవల్ని లక్కీ డిప్ ద్వారా టీడీపీ అందిస్తూ వచ్చిందన్నారు.
ఇక మీదట వీఐపీ బ్రేక్‌ను కూడా లక్కీ డిప్ ద్వారా అందించాలని భక్తులు కోరారని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. దీని మీద చర్చించి త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఫస్ట్ టైమ్ టీటీడీ తెలుగు క్యాలెండర్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తోందన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 5 వేల క్యాలెండర్స్ అందుబాటులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. రోజుకు 30 వేల ఎస్ఎస్డీ టోకెన్స్ జారీ చేస్తున్నామని వివరించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రం పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు. సమ్మర్లో తిరుమలకు వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కలిగేలా చలవ పందిళ్లు, చలవ సున్నం వేయించామన్నారు. భక్తులకు మజ్జిగ, అన్నపానీయాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు ధర్మారెడ్డి.