iDreamPost
android-app
ios-app

తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు- ఆర్జిత సేవలు రద్దు!

  • Published Aug 04, 2024 | 6:34 PM Updated Updated Aug 04, 2024 | 6:34 PM

తిరుమలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఆ తిరుమల కొండకు తరలి వెళ్తుంటారనే విషయం తెలసిందే. ఈ క్రమంలోనే.. తిరుమలకు దేవస్థానంకు సంబంధించి ప్రతి సమాచారాన్ని టీటీడీ సంస్థ భక్తులకు తెలియజేస్తూ అలర్ట్ చేస్తుంటారు. ఈ మేరకు తాజాగా తిరుమలలో ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనలు, ఆర్జిత సేవలు రద్దూ చేస్తున్నట్లు ప్రకటించారు.

తిరుమలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఆ తిరుమల కొండకు తరలి వెళ్తుంటారనే విషయం తెలసిందే. ఈ క్రమంలోనే.. తిరుమలకు దేవస్థానంకు సంబంధించి ప్రతి సమాచారాన్ని టీటీడీ సంస్థ భక్తులకు తెలియజేస్తూ అలర్ట్ చేస్తుంటారు. ఈ మేరకు తాజాగా తిరుమలలో ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనలు, ఆర్జిత సేవలు రద్దూ చేస్తున్నట్లు ప్రకటించారు.

  • Published Aug 04, 2024 | 6:34 PMUpdated Aug 04, 2024 | 6:34 PM
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు- ఆర్జిత సేవలు రద్దు!

భారత దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. ఇక్కడ స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలిసారు. అందుకే ఈ పుణ్యక్షేత్రన్ని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. అంతేకాకుండా.. ప్రతిరోజు దేశం నలువైపులా నుంచి కోట్లాది మంది భక్తులు ఆ శ్రీనివాసుడని దర్శించుకునేందుకు ఈ తిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తూ.. తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇకపోతే తిరుమల కొండపై ఎప్పుడు భక్తుల రద్దీ భారీగా ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. భక్తులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ దేవస్థానం సంస్థ ఎప్పటికప్పుడు పలు సమాచారాలను అందిస్తూ భక్తులకు అలర్ట్ చేస్తుంటారు.ఈ మేరకు తాజాగా టీటీడీ సంస్థ శ్రీవారి భక్తులకు ముఖ్య అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా తిరుమలలో ఆ తేదీలోని ప్రత్యేక దర్శనలు, ఆర్జిత సేవలు రద్దు అంటూ ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తిరుమలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఆ తిరుమల కొండకు తరలి వెళ్తుంటారనే విషయం తెలసిందే. ఈ క్రమంలోనే.. తిరుమలకు దేవస్థానంకు సంబంధించి ప్రతి సమాచారాన్ని టీటీడీ సంస్థ భక్తులకు తెలియజేస్తూ అలర్ట్ చేస్తుంటారు. ఈ మేరకు తాజాగా తిరుమలలో ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనలు, ఆర్జిత సేవలు రద్దూ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ అదేమిటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరికొన్ని రోజుల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఇక ఆ ఉత్సవాలకు సంబంధించిన తేదీ కూడా ఖరారు చేశారు. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

అయితే  ఆ బ్రహ్మోత్సవాల విషయానికొస్తే.. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే.. అక్టోబర్ 8న శ్రీవారి గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం నిర్వహిస్తారు. అక్టోబర్ 12న చక్రస్నానం కార్యక్రమం ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ వివిధ వాహనాలపై కొలువుదీరి మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు. వాహన సేవలు రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉంటే.. బ్రహ్మోత్సవాలకు ఇంక మరో రెండు నెలలు సమయం ఉన్నందున ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఇప్పటి నుంచే తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది.

ఇక ఇందులో భాగంగానే.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శనివారం అధికారులతో అన్నమయ్య భవన్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఆ సమావేశంలో  ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ పై దృష్టి సారించిన టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభంయిన రెండు రోజుల తర్వాత.. అనగా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 11 నుంచి అక్టోబర్ 8వ తేదీ అర్ధరాత్రి కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. అంతేకాకుండా..వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. చిన్నపిల్లలు తల్లిదండ్రులు, దివ్యాంగులు, వృద్ధులకు అందించే ప్రత్యేక దర్శనాలతో పాటుగా అన్ని ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. మరీ, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.