iDreamPost

10వ తరగతి పాసైన విద్యార్థులకు TTD గుడ్ న్యూస్..! ఈ రోజే లాస్ట్.. మిస్సైతే ఇక అంతే..

TTD Good News: 10 తరగతి పాసైన వారికి తిరుమల తిరుపతి దేవస్థానం సూపర్ అవకాశం కల్పించింది. అంతేకాక ఈ సూపర్ ఛాన్స్ కి నేడే చివరి తేదీగా ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

TTD Good News: 10 తరగతి పాసైన వారికి తిరుమల తిరుపతి దేవస్థానం సూపర్ అవకాశం కల్పించింది. అంతేకాక ఈ సూపర్ ఛాన్స్ కి నేడే చివరి తేదీగా ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

10వ తరగతి పాసైన విద్యార్థులకు TTD గుడ్ న్యూస్..! ఈ రోజే లాస్ట్.. మిస్సైతే ఇక అంతే..

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలను అందిస్తుంది. ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అనేక చర్యలు తీసుకుంటుంది. ఇలా కేవలం శ్రీవారి కార్యక్రమాలే కాకుండా.. అనుబంధంగా టీటీడీ పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. టీటీడీ ఆధ్వర్యంలో పలు ఆస్పత్రులు, విద్యాసంస్థలు కూడా నడుస్తున్నాయి. ఏటా ఈ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. తాజాగా పదో తరగతి పాసైన విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. టీటీడీ నుంచి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అలానే ఈ ఏటాది కూడా ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్లు పొందేందుకు టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది. ఈనెల మొదట్లో జూనియర్ కాలేజీల అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2024 – 25 అకడమిక్ కు ప్రవేశాలు కల్పిస్తారు.  10వ తరగతి పాసైన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అంతేకా మే 31వ తేదీ అంటే నేటితో ముగియనునంది. ఆన్ లైన్‌లో అప్లయ్ చేసే వారికి ఇంగ్లిష్‌ భాషలో మాత్రమే ఉంటుంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్‌ను తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు https://admission.tirumala.org/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి :

  • ఆసక్తి గల విద్యార్థులు తొలుత https://admission.tirumala.org/ అనే టీటీడీ అధికారిక వెబ్ సైట్ ఓపెన్‌ చేయాలి.
  • అలానే భాషను ఎంపిక చేసుకునేందుకు రెండు బాక్స్‌లు కనిపిస్తాయి.
  • విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన క్లిక్ చేయాలి.
  • అనంతరం దరఖాస్తు కు సంబంధించి ఇచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి.
  •  ఆ తరువాత  ఇంటర్మీడియేట్ కోర్సుకు జూనియర్‌ కాలేజీని ఎంపిక చేసుకుని సబ్మిట్ చేయాలి.

విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక.. వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీటు తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ పంపుతారు. విద్యార్థులు దరఖాస్తు నింపే సమయంలో సందేహాలు, కోర్సుల్లోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను సంబంధిత  సహయ కేంద్ర ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. మొత్తంగా టీటీడీ ఇచ్చిన ఈ సూపర్ ఛాన్స్ ఈ రోజే లాస్ట్. ఆసక్తిగల విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి