iDreamPost
android-app
ios-app

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. TTD ఉచిత బస్సులు!

  • Published May 25, 2024 | 10:03 PM Updated Updated May 25, 2024 | 10:16 PM

తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వాళ్ల కోసం మరో మంచి నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వాళ్ల కోసం మరో మంచి నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Published May 25, 2024 | 10:03 PMUpdated May 25, 2024 | 10:16 PM
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. TTD ఉచిత బస్సులు!

తిరుమల కొండపై కొలువైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సుదూరాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా శ్రీనివాసుడ్ని చూసేందుకు బారులు తీరతారు. ఒక్కసారి వెంకన్నను చూశాక ప్రయాణ అలసటను మర్చిపోయి భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. అలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. మండు వేసవి కావడంతో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీటితో పాటు అన్నప్రసాదాన్ని కూడా పంపిణి చేసింది. అలాగే భక్తుల కోసం ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మర్ హాలీడేస్​తో పాటు వీకెండ్ కావడంతో శనివారం కొండ మీదకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లోని అన్ని కంపార్ట్​మెంట్స్ భక్తులతో ఫుల్ అయిపోయాయి. దీంతో క్యూ లైన్.. ఔటర్ రింగ్ రోడ్డులోని శిలాతోరణం దాకా విస్తరించింది. భక్తులు భారీగా రావడంతో వాళ్లకు ఇబ్బంది కలుగకుండా టీటీడీ స్పెషల్ అరేంజ్​మెంట్స్ చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి కృష్ణతేజ సర్కిల్ దాకా తాగునీటిని ఏర్పాటు చేసింది. నాలుగు చోట్ల అన్నప్రసాదం, 27 చోట్ల మంచినీటి సరఫరా కేంద్రాలు పెట్టింది. అలాగే భక్తుల కోసం ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి శిలాతోరణం దాకా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు.

వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శనివారం 60 వేల మందికి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్స్​లో 50 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీంతో టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే సిఫార్సు లేఖల్ని కూడా స్వీకరించబోమని తిమరుల బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. సమ్మర్ హాలీడేస్ ముగింపుతో పాటు ఎగ్జామ్ రిజల్ట్స్ వెల్లడైన నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లను కూడా వేగవంతం చేశారు.