iDreamPost
android-app
ios-app

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ

  • Published Sep 21, 2023 | 10:48 AM Updated Updated Sep 21, 2023 | 10:48 AM
  • Published Sep 21, 2023 | 10:48 AMUpdated Sep 21, 2023 | 10:48 AM
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తులకు కీలక సూచన చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామి వారికి అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో.. భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని.. టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చెందవని.. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కనుకు భక్తులు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని టీటీడీ సూచించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు సెప్టెంబరు 21న తిరుమలకు చేరుకుంటాయి.

అలాగే శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ నాడు.. భక్తులు భారీగా తరలి వస్తారు. ఈ సారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబ‌రు 22న గరుడసేవ నిర్వహిస్తున్నాడు. ఆ రోజున భారీ ఎత్తున భక్తులు తిరుల చేరుకుంటారు. రద్దీ మాత్రమే కాక ఘాట్ రోడ్ల‌లో భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబ‌రు 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుండి సెప్టెంబ‌రు 23వ తేదీ ఉదయం 6 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. తిరుప‌తిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వ‌ద్ద టూవీలర్స్‌ పార్క్ చేసుకునే స‌దుపాయాన్ని కల్పిస్తుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేసింది.