Special Trains To Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి ప్రతీ రోజు వేల మంది తిరుమలకు వస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, భక్తుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ..

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి ప్రతీ రోజు వేల మంది తిరుమలకు వస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, భక్తుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ..

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. ట్రైన్స్ ఎక్కువ రద్దీగా ఉంటున్న కారణంగా.. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ప్రత్యేక రైళ్లను డిసెంబర్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి సహా పలు ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే వారు 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇక ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్స్ ను డిసెంబర్ ఆఖరి వారం వరకు పొడిగిస్తున్నారు. కాగా, ట్రైన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

  • తిరుపతి-సికింద్రాబాద్‌ (07481) ట్రైన్.. డిసెంబర్ 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడవనుంది.
  • సికింద్రాబాద్‌-తిరుపతి (07482) ట్రైన్ డిసెంబరు 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉండనుంది.
  •  హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631) స్పెషల్ ట్రైన్ డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి శనివారం అందుబాటులో
    ఉండనుంది.
  • నర్సాపూర్‌-హైదరాబాద్‌ (07632) ట్రైన్ డిసెంబరు 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడవనుంది.
  • కాకినాడ-లింగంపల్లి (07445) ట్రైన్ డిసెంబరు 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతి సోమవారం , బుధవారం , శుక్రవారాల్లో
    నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
  •  లింగంపల్లి-కాకినాడ (07446) మధ్య నడిచే ట్రైన్ డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళవారం , గురువారం ,
    శనివారాల్లో అందుబాటులో ఉండనున్నాయి.

ఇక తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య రెండు జతల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఏదేమైనా, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి తీరాల్సిందే. ఇక ఈ వార్త రైల్వే ప్రయాణికుల పాలిట వరంగా మారింది.

కాగా, డిసెంబర్‌ నెలలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను తాజాగా టీటీడీ ప్రకటించింది.

  • డిసెంబ‌రు 10న శ్రీ గోవింద‌రాజ‌స్వామి తిరువ‌డి స‌న్నిధికి రానున్నారు.
  • 11న శ్రీ క‌పిలేశ్వరాల‌యంలో సోమ‌వారాభిషేకం.
  • 17న తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ఆల‌యంతోపాటు ఇత‌ర ఆల‌యాల్లో ధ‌నుర్మాసం ప్రారంభం.
  • 22 నుండి 26 వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వరాల‌యంలో తెప్పోత్సవాలు.
  • 23న శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వరాల‌యంలో వైకుంఠ ఏకాద‌శి.
  • 27న శ్రీ క‌పిలేశ్వరాల‌యంలో ఆరుద్ర ద‌ర్శన మ‌హోత్సవాన్ని టీటీడీ నిర్వహించనుంది.
  •  24న వైకుంఠ ద్వాద‌శి నాడు శ్రీ‌వారి చ‌క్రస్నానం. శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి జరగనుంది.

మరి, టీటీడీ భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు తిప్పటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments