iDreamPost
android-app
ios-app

అగ్రికల్చర్ అసిస్టెంట్ గా విధులు.. ఆ రోజు ఎవరూ లేని టైమ్ లో..!

అగ్రికల్చర్ అసిస్టెంట్ గా విధులు.. ఆ రోజు ఎవరూ లేని టైమ్ లో..!

పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు ప్రియాంక, వయసు 27 ఏళ్లు. కొంత వరకు చదువుకున్న ఈ యువతి మొన్నటి వరకు సచివాలయ ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు. ఇక ఆ యువతి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులతో పాటే ఉండేది. కూతురు మంచి ఉద్యోగం చేస్తుండడంతో ఆమె తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. ఇక ఉద్యోగంలో భాగంగా ప్రియాంక పేదలకు సేవలందిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ఆ యువతి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. కూతురు ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ధనపాల ప్రియాంక (27) అనే యువతి నివాసం ఉంటుంది. ఈ యువతి బాగానే చదువుకుంది. అయితే, ప్రియాంక గత కొన్ని రోజుల నుంచి సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా విధులు నిర్వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆ అమ్మాయి గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. గత మూడు రోజుల కిందట ఆ నొప్పి మరింత ఎక్కువైంది. ఆ సమయంలో ప్రియాంకకు ఏం చేయాలో అస్సలు తోచలేదు.

ఆ నొప్పిని భరించలేపోయిన ఆ యువతి.. చేసేదేంలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక ఫలితం లేకపోవడంతో ఆ ప్రియాంక చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచింది. ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న కూతురు ఇలా చేయడంతో ఆ యువతి తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: టిఫిన్‌ చేసి, వేరే రూములోకి వెళూతూ ఉంది.. ఇంతలోనే..