AP: విద్యార్థులకు మరో గుడ్ న్యూస్.. రేపు స్కూళ్లకు, కాలేజీలకు సెలవు!

Andhra Pradesh: ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు వచ్చిన సంగతి తెలిసింది. తాజాగా విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రేపు స్కూళ్లకు సెలవును ప్రభుత్వం ప్రకటించింది.

Andhra Pradesh: ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు వచ్చిన సంగతి తెలిసింది. తాజాగా విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రేపు స్కూళ్లకు సెలవును ప్రభుత్వం ప్రకటించింది.

విద్యార్థులకు సెలవు వస్తున్నాయంటే.. ఏదో తెలియని సంతోషం ఉంటుంది. అలానే పాఠశాలలు ప్రారంభమై..మధ్యలో సడెన్ గా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటిస్తే..కొందరు పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తారు. విద్యార్థులకు సెలవులు అంటే ఓ శుభవార్తే. ఈ క్రమంలోనే విద్యాశాఖ, ప్రభుత్వాలు కూడా పలు సందర్భాల్లో సెలవులు ప్రకటిస్తుంటారు. సెలవులకు సంబంధించి..ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. రేపు సోమవారం విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.

ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు వచ్చిన సంగతి తెలిసింది. తాజాగా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ సర్కార్.. సెప్టెంబర్ 16, సోమవారం రోజున స్కూళ్ల, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ఇక ఇవాళ ఆదివారం ఎలాగు హాలిడేనే కావడం, రేపు కూడా సెలవు కావడంతో మొత్తం రెండు రోజులు హాలీడేస్ వచ్చాయి. ఇక 15, 16 సెలవుల తరువాత తిరిగి సెప్టెంబర్ 17న మంగళవారం స్కూల్స్  పున:ప్రారంభం అవ్వనున్నాయి. వాస్తవాని సెప్టెంబ్ 14 శనివారంతో కలిపి మూడు రోజులు సెలవులు వచ్చేవి. అయితే భారీ వర్షాలు, వరదల ఇటీవల పాఠశాలకు వరుస సెలవులు ఇచ్చారు. పలు జిల్లాలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో స్కూల్ వర్కింగ్ డేస్ ను దృష్టిలో ఉంచుకుని రెండో శనివారం కూడా తరగతులు నిర్వహించారు.

దీంతో మూడు రోజుల సెలవులు కాస్తా..రెండు రోజులకు మారాయి.  ఇదే సమయంలో తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం మిలాద్ ఉన్ నబీ సెలవును ప్రభుత్వం ఇచ్చింది. అదే రోజు హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. ఈనెల 22వ తేదీన ఆదివారం, 28నాలుగో శనివారం కొన్ని పాఠశాలలకు సెలవు ఉంది. సెప్టెంబర్ 29న ఆదివారం సెలవు ఉన్న సంగతి తెలిసింది. అలాగే పండగలు ఉంటే ఇంకా ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు పండగ చేసుకుంటారు. మొత్తంగా తెలంగాణ, ఆంధ్రలో కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో పలువురు సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Show comments