ఈ మధ్యకాలంలో అందరి నోటి నుంచి వస్తున్న మాట.. టమాటా. కారణం దీని ధర భారీగా పెరగడం. ఇప్పుడు టమాటా ధర డబుల్ సెంచరికి చేరింది. ఇప్పట్లో అక్కడి నుంచి దిగివచ్చేట్లు కనిపించడం లేదు. ఇలా ఒకవైపు టమాటాను కొనే సామాన్యులకు కన్నీరు తెప్పిస్తున్నా.. మరొకవైపు ఆ పంటను సాగు చేసిన రైతులకు మాత్రం సంతోషాన్ని ఇస్తుంది. ఈ పంటను సాగు చేసిన రైతులు చాలా మంది భారీ లాభాలు చూశారు. అయితే అలానే అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతుకు టమాటా సాగుతో మంచి లాభాలు వచ్చాయి. ఈక్రమంలో తన తోటల పని చేసిన కూలీలకు చీరలను బహుమతిగా ఇచ్చి.. మంచి మనస్సు చాటుకున్నారు. మరి.. ఆ రైతు ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లికి చెందిన నరసింహారెడ్డి అనే రైతు.. తనకున్న 5 ఎకరాల పొలంలో టమాట పంట సాగు చేశారు. ఎప్పుడు ఆదుకుంటుదా? అని టమాట పంట వైపు ఆశగా చూసిన ఈ రైతుకు.. ఈ సారి మంచి దిగుబడితో పాటు ధర బాగుండటంతో మంచి లాభాలు గడించారు. ఇక ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలానే నరసింహారెడ్డి..తన టమాట సాగులో భాగస్వాములైన కూలీలకు మంచి చేయాలని భావించారు.
వారికే ఏదో ఒక బహుమతి ఇచ్చి.. రుణం తీర్చుకోవాలని అనుకున్నారు. ఈక్రమంలో సుమారు20 మంది మహిళలకు చీరలు, పురుషులకు కొత్త బట్టలు కొనిచ్చారు. అలానే తాను కొత్త దుస్తులు పంచే సమయంలో అందుబాటులో లేని మహిళలను కూడా గుర్తుపెట్టుకొని వారికి ఇవ్వాలని భావించాడు. వారి కోసం మరికొన్ని చీరలు తెప్పించి.. తరువాత అందజేశారు. నరసింహారెడ్డి మంచి మనస్సులు ఆ కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. వచ్చిన లాభాలను కూడబెట్టుకునే మనుషులు ఉన్న ఈ కాలంలో.. నరసింహారెడ్డి లాంటి వారు కూడా ఉన్నారని స్థానికులు అంటున్నారు.
వ్యయ ప్రయాసలు ఓర్చి వ్యాపారం చేసి విజయవంతమైన వారు,లక్షలకు లక్షలు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు అయితే తమ విజయంలో భాగమైన కార్మికులను గుర్తుంచుకొని కొంత పంచి పెట్టాలని భావించే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వారి జాబితాలో ఈ టమాటా రైతు నరసింహా రెడ్డి చేశారు. రైతు కాబట్టే.. కూలీల కష్టం ఏంటో తెలుసు కాబట్టే ఈ మంచి పని చేశారని ఈ వార్త తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. చీరల పంపిణీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. మంచి మనస్సు చాటుకున్న ఈ రైతుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వర్షాలకు హైదరాబాద్ సిటీనే మునిగిపోయింది.. నువ్వో లెక్కా?: బొత్స సత్యనారాయణ