P Krishna
Tadepalligudem Crime News: ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Tadepalligudem Crime News: ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
P Krishna
నేటి సమాజంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోకి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు.. హత్యలకు పాల్పపడుతున్నారు. దీంతో వారి కుటుంబంాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఒక చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి ఓ మహిళ చావుకు కారణం అయ్యింది. ఇంతకీ ఆ గొడవ ఏంటీ? ఎందుకు ఆ మహిళ హత్యకు గురైంది.. ఎక్కడ అన్న విషయం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలిపై మామ రోకలిబండతో దాడి చేసి హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన ఎం శ్రీనివాస్, సత్య కుమారి ల ఏకైక కుమార్తె నాగ శ్రావణిని ఐదేళ్ల క్రితం తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన లక్కోజు కేశవరావు, సూర్య కుమారిల తనయుడు శ్రీనివాసరావు కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు సంతానం.. కుమారుడు రిశాంత్ (4), కూతురు జస్విత సూర్యశ్రీ (3). శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం దుబాయ్ కి వెళ్లి కుటుంబానికి డబ్బు పంపిస్తున్నాడు. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్న సమయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఆదివారం ఇంట్లో అందరూ ఓ శుభకార్యానికి వెళ్లారు. ఇంటికి వచ్చిన తర్వాత కుమారడి నడుకు ఉండాల్సిన వెండి మొలతాడు కనిపించకుండా పోయింది. దీంతో శ్రావణి తన కొడుకు రిశాంత్ ని తాడు ఎక్కడ పోగొట్టుకున్నావ్ అంటూ కొట్టింది. అక్కడికి వచ్చిన మామ కేశవరావు కోడలు శ్రావణిపై సీరియస్ అయ్యాడు. తల్లిగా పిల్లల బాధ్యత నీది.. నువు ఎందుకు అంత అశ్రద్దగా ఉన్నావ్ అంటూ గొడవకు దిగాడు. దీంతో మామ, కోడలి మధ్య గొడవ పెద్దగా మారింది. అదే రోజు రాత్రి కేశవరావు రోకలి బండతో శ్రావణి తలపై బాదడంతో అక్కడిక్కడే చనిపోయింది శ్రావణి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు. నిందితుడు కేశవరావు, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపైపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.