iDreamPost
android-app
ios-app

స్వాతంత్య్ర వేడుకలకని ఇంటి నుంచి వెళ్లిన టీచర్! కానీ..

స్వాతంత్య్ర వేడుకలకని ఇంటి నుంచి వెళ్లిన టీచర్! కానీ..

దేశ వ్యాప్తంగా  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్ని పాఠశాల్లోనూ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అయితే ఈ పండగ పూట పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి.. కొందరు మృతి చెందగా, మరికొందరు గాయలపాలయ్యారు. విశాఖ పట్నంలోనే ఆనందపురం-పెందుర్తి జాతీయ రహదారిలో మంగళవారం ఉదయం వేగంగా వెళ్తున్న ఓ కారు ప్రమాదానికి గురై ఉపాధ్యాయురాలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్వాతంత్ర్య వేడుకలకని ఇంటి నుంచి బయలు దేరిన ఆ టీచర్..తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనకాపల్లి జిల్లా తగరపువలస ప్రాంతానికి చెందిన  సంధ్యారమణఇ(43), సునీత కుమారి(38), స్వాతి(35) అనే ముగ్గురు ఉపాధ్యాయినులు కె.కోటపాడు మండలంలోని వేర్వేరు పాఠశాలల్లో పని చేస్తున్నారు. స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యేందుకు వీరందరూ కారులో మంగళవారం తగరపువలస నుంచి బయలుదేరారు. ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలో కారు ముందు టైరు పేలింది.  దీంతో కారు డివైడర్‌ను ఢీకొని పక్కరోడ్డులోకి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆ ముగ్గురు టీచర్లు, ఇద్దరు చిన్నారులు, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాని గుర్తించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స వచ్చేలోపు వీరిలో తగరపువలస జ్యూట్‌ మిల్లు ప్రాంతానికి చెందిన సంధ్యారమణి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతురాలు సంధ్యారమణి గొండుపాలెం ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నారు. మరో టీచర్ సునీతాకుమారికి తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈమె చౌడువాడ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే కారులో స్వాతి ..తన ఇద్దరు పిల్లలు కీర్తిక(8), హంసిత(10)లతో కలిసి ప్రయాణిస్తున్నారు.

ఆమె కూడా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయారు. స్వాతి పైడంపేట పాఠశాలలో పనిచేస్తున్నారు. చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్నపోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని రోడ్డు పైనుంచి తొలగించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో గాయపడిన వారిని 108 వాహనంలో వేర్వేరు వైద్యశాలలకు తరలించినట్లు పోలీసుల పేర్కొన్నారు. స్వాతంత్ర్య వేడుకలని వెళ్లి.. విగత జీవిగా మారడంతో తగరపు వలసలోని మృతురాలి ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  ప్రియుడిపై కోపంతో యువతి కిరాతకం! అతడి బిడ్డను..