నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరుగుతుంటాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపడం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే తరచూ స్కూల్ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎందరో చిన్నారులు మృత్యువాత పడ్డారు. తాజాగా బాపట్ల జిల్లాలో కూడా ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తొమ్మింది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
బాపట్ల జిల్లా అమృతలూరు వద్ద ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సదరు పాఠశాలకు చెందిన విద్యార్థులు బస్సులో స్కూల్ కి హాజరయ్యారు. అక్కడ స్కూల్ జరిగిన కార్యక్రమాలో పాల్గొన్ని సందడి చేశారు. ఇక వేడుకలు ముగించుకుని విద్యార్థులు తిరిగి ఇళ్లకు బయలు దేరారు. ఈక్రమంలో అమృతలూరు మండలం కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య స్కూల్ పిల్లల బస్సు ప్రమాదానికి గురైంది. వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా అదుపు తప్పి.. పక్కనే ఉన్న పొల్లాలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: రీల్స్ మోజులో భార్య.. హత్య చేసిన భర్త!