నిత్యం అనేక రకాల మరణాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు వంటి ఇతర కారణాలతో మృతి చెందుతున్నారు. అయితే కొందరి కుటుంబాలు మృతదేహాలకు పోస్టు మార్టం చేయించి.. ఆ తరువాత ఖననం చేస్తుంటారు. కొందరు మాత్రం పోస్టుమార్టం చేయకుండా సమాధి చేస్తుంటారు. అయితే కొన్ని నెలల తరువాత వివిధ కారణాలతో పూడ్చిన శవాలను బయటకు తీసి మరీ పోస్టు మార్టం చేస్తుంటారు. తాజాగా ఓ మహిళ కూడా తన భర్త చనిపోయిన మూడు నెలకు పోస్టు మార్టం చేయించింది. అయితే తన పిల్లల భవిష్యత్తు కోసం ఈ పని చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పిచ్చలవాండ్ల పల్లె పంచాయతీ పందివానిపెంటకు చెందిన రేపన చౌడప్ప(33) బెంగళూరులోని విప్రో కంపనీలో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చౌడప్పకి భార్య శిల్ప, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చౌడప్ప బెంగళూరు నుంచి మోటర్ సైకిల్ పై స్వగ్రామానికి బయలు దేరారు. మార్గం మధ్యంలో మదనపల్లె గ్రామీణ మండలంలోని చీకలబైలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో చౌడప మృతి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చౌడప్ప సాఫ్ట్ వేర్ ఇంజినీరు కావడంతో అతడి మృతి తరువాత అందించే బెనిఫిట్స్ కోసం కంపెనీ పోస్టుమార్టం సర్టిఫికెట్ కావాలి కోరింది.
దీంతో చౌడప్ప భార్య శిల్ప.. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గంగాధరరావును కలిసి తన సమస్యను వివరించారు. తన భర్త చౌడప్ప మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి ధృవీకరణ పత్రం ఇప్పించాలని కోరింది. ఎస్పీ ఆదేశాలతో శుక్రవారం మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ, ఎమ్మార్వో పర్యవేక్షణలో సమాధి తొలగించి మృతదేహాన్ని బయటకు తీయించారు. అక్కడే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. దానిని వీడియోలో చిత్రీకరించారు. మూడు నెలల తరువాత శవానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని తెలిసి పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసిన శాడిస్ట్ భార్య!