Arjun Suravaram
P Narayana: సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్ రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్ స్పైర్లను వాడుకున్నట్లు అధికారుల సోదాల్లో వెల్లడైంది
P Narayana: సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్ రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్ స్పైర్లను వాడుకున్నట్లు అధికారుల సోదాల్లో వెల్లడైంది
Arjun Suravaram
రాజకీయాల్లో అవినీతికి పాల్పడే వారే ఎక్కువగా ఉన్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. తాము స్కాములకు పాల్పడుతూ.. పక్కవారిపైన నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ జాబితాకు చెందిన వారే టీడీపీ నేతలని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఇందుకు నిదర్శనమే మాజీ మంత్రి పి నారాయణ కుటుంబంలో బయటపడిన అవినీతి భాగోతం. నారాయణ అల్లుడు ఏకంగా పది కోట్ల పన్ను ఎగవేయడంతో, ఆ నేరాలు వెలుగులోకొచ్చాయి. అయితే ఇవేమి టీడీపీ నేతలకు, ఆ పార్టీకి కొమ్ము కాసే మీడియాకు కనిపించడం లేదు. వివరాల్లోకి వెళ్తే..
మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధినేత పి. నారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్ రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్ స్పైర్లను వాడుకున్నట్లు అధికారుల సోదాల్లో వెల్లడైంది. నారయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాలను చెల్లింపు పేరుతో ఎన్ స్పైర మేనేజ్ మెంట్ సర్వీసెస్ కంపెనీ ఏర్పాటైంది.
ఈ ఎన్‌స్పైర్ మేనేజ్‌మెంట్ సర్వీస్ పేరుతో నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని ఈ తనిఖీల్లో వెల్లడైంది. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారని తెలింది. అయితే తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ ఈ కంపెనీని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్ స్పైర కు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లీంచారు.
ఇలా వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమాకూర్చున్నారట్లు తెలింది. మొత్తంగా 10 కోట్ల మేర పన్ను ఎగవేశారు. నారాయణ సమీప బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేసిన పోలీసులకు సరైన పత్రాలు చూపించనందున రూ. 1.82 కోట్ల నగదు సీజ్ చేశారు. పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్‌స్పైర్ మేనేజ్‌మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదని, డీఆర్‌ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇక ఈ వ్యవహారంపై మాజీ నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశారు. విద్యా సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వ్యక్తిగత పనులకు వాడుకోవడం కూడా నేరమే అనే సంగతి తెలిసింది. దీంతో ఈ ఇష్యుపై నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇక ఈ కంపెనీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో పరిశీలిస్తే.. భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయ పన్ను శాఖకు అప్పగించనున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు.