iDreamPost
android-app
ios-app

వారంలో పెళ్లి అనగా.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి!

వారంలో పెళ్లి అనగా.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి!

ప్రేమ.. పేరుకి రెండు అక్షరాలే అయినా ఒక జీవితం మొత్తానికి సరిపడే ఎమోషన్. అందుకే తమ ప్రేమని కాపాడుకోవడానికి యువత ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ముందుకి పోతుంటారు. తమ ప్రేమని బతికించుకోలేని సమయంలో చావుని కూడా ఆనందంగా స్వీకరించిన జంటలను చూస్తూనే ఉన్నాము. కానీ.., తల్లిదండ్రుల కన్న ప్రేమని లెక్క చేయకుండా, క్షణికావేషంలో వీరు తీసుకునే నిర్ణయాలు.. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఇలాంటి విషాదమే నెలకొంది. కలిసి బతకడం కుదరక, ఓ జంట కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో.. తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అన్నమయ్య జిల్లాలోని రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లి గ్రామానికి చెందిన రమణ, రజిని దంపతులకు కళ్యాణి(17) అనే కూతురు ఉంది. ఈమె చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇంటర్ చదువుతోంది. కాలేజీలో ఈమెకి యుగంధర్‌(17)తో పరిచయం అయ్యింది. ఇతనిది కూడా అదే ప్రాంతం. ఇద్దరూ కొన్నేళ్ళుగా ప్రేమలో మునిగి తేలుతుండటంతో.. ఆ విషయం కాస్త పెద్దల వరకు చేరింది. దీంతో.. కళ్యాణికి ఆమె తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంకో వారంలో కళ్యాణి వివాహం జరగనుండగా కళ్యాణి తన ప్రియుడితో ఇంట్లో నుండి వెళ్లిపోయింది. శనివారం వీరిద్దరూ అదృశ్యం అవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే.., ఆదివారం తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్‌ రోడ్డులోని అడవిలో ప్రేమికులు ఇద్దరూ శవాలై కనిపించారు. పెద్దలు తమ పెళ్ళికి ఒప్పుకోరు అనే భయంతో.. కళ్యాణి, యుగంధర్ చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఆదివారం పశువుల మేత కోసం కాపరులు అడవిలోకి వెళ్లగా.. కళ్యాణి, యుగంధర్ లు చెట్టుకి వేలాడుతూ శవాలై కనిపించారు. దీంతో.. వారు పోలీసులకు సమాచారం అందించడంతో చంద్రగిరి సీఐ రాజశేఖర్‌, ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. కాగా.. కళ్యాణి వారంలో వివాహం పెట్టుకుని, ఇలా చేయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యుగంధర్ కన్నవారికి ఇలాంటి కడుపు కోతే మిగలడంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఏదేమైనా.. ప్రేమ అంటే సరిగ్గా తెలియని వయసులోనే.. కళ్యాణి, యుగంధర్ కన్నుమూయడం విషాదకరం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దారుణం: 5 ఏళ్ల చిన్నారిని నేలకేసి కొట్టిన సాధువు!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet