iDreamPost

భర్త, పాపతో సంతోషమైన జీవితం.. కానీ, ఆ చిన్న ఆలోచనతో దారుణం!

నేటికాలంలో భార్యాభర్తల మధ్య వచ్చే వివిధ రకాల గొడవలు సంసారాన్ని నిట్టనిలువును కాల్చేస్తున్నాయి. చెడు వ్యసనాలకు కొందరు బలవుతుంటే. ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో వచ్చే  గొడవల కారణంగా మరికొందరు జీవితాన్ని ముగిస్తున్నారు.

నేటికాలంలో భార్యాభర్తల మధ్య వచ్చే వివిధ రకాల గొడవలు సంసారాన్ని నిట్టనిలువును కాల్చేస్తున్నాయి. చెడు వ్యసనాలకు కొందరు బలవుతుంటే. ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో వచ్చే  గొడవల కారణంగా మరికొందరు జీవితాన్ని ముగిస్తున్నారు.

భర్త, పాపతో సంతోషమైన జీవితం.. కానీ, ఆ చిన్న ఆలోచనతో దారుణం!

మనిషి జీవితం అనేది ఎంతో గొప్పది. ఈ  భూ ప్రపంచంలో ఏ జీవికి లేని  ప్రత్యేక శక్తి, అవకాశాలు మానవుడికి ఉన్నాయి. ఇలాంటి లైఫ్ ను చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా నేటికాలంలో భార్యాభర్తల మధ్య వచ్చే వివిధ రకాల గొడవలు సంసారాన్ని నిట్టనిలువును కాల్చేస్తున్నాయి. అక్రమ సంబంధాలు, ఇతర చెడు వ్యసనాలకు కొందరు బలవుతుంటే. ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో వచ్చే  గొడవల కారణంగా క్షణికావేశంలో మరికొందరు జీవితాన్ని ముగిస్తున్నారు. మరికొందరు అసలు జీవితాన్ని ఎందుకు ముగిస్తున్నామో తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్ భార్యా అలాంటి దారుణమైన పని ఒకటి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే…

శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలం కుమ్మరి గుంట  చెందిన కృష్ణారావుకు పాతపట్నం  మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతి(27)తో వివాహం జరిగింది. వీరి పెళ్లి  దాదాపు తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. ప్రస్తుతం వీరు కర్లెమ్మ పంచాయతీ  ఎన్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్నారు.  రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్‌ స్టేషన్‌లో ఫైర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల పాప వయస్సు గల కుమార్తె ఉంది. ఇక వీరి సంసారం చాలా బాగ సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అలానే కృష్ణారావు..ఫైర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహింస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

రోజూ విధులకు వెళ్లి మధ్యాహనం సమయంలో భోజనంకు ఇంటికి వెళ్లేవాడు. అదే విధంగా ఎప్పటి మాదిరిగానే బుధవారం కూడా కృష్ణారావు విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. ఇలా ఇంటికి వెళ్లిన కృష్ణారావు తలుపు తెరచి చూసి.. ఒక్కసారిగా షాకి గురయ్యాడు. తన భార్య రేవతిని ఆ స్థితిలో చూసి.. షాకయ్యాడు. అసలు తన భార్య అలాంటి పిచ్చి పని ఎలా చేసిందని అయోమయంలో ఉన్నాడు. కృష్ణారావు ఇంటి తలుపు తెరచి లోపలికి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే రేవతిని కిందకు దించాడు. అలానే స్థానికుల సహకారంతో సమీపంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లాడు.

అయితే అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఏంఏ ఆహ్మద్‌ తెలిపారు. ఇలా చాలా మంది మహిళలు వివిధ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చావే సమస్యకు పరిష్కారం అని భావించడం మూర్ఖత్వమని పలువురు మేధావులు చెబుతున్నారు. మరి..ఇలాంటి ఆత్మహత్య ఘటనల నివారణకు ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి