iDreamPost
android-app
ios-app

వీకెండ్ ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధర.. కిలో ఎంతంటే?

Today Chicken And Egg Prices: నాన్ వెజ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. వీకెండ్ కి ముందు చికెన్ ధరలు కొండెక్కాయి. వారం క్రితం తగ్గాయని సంబరాలు చేసుకున్న వాళ్లు ఇప్పుడు బోరు మంటున్నారు.

Today Chicken And Egg Prices: నాన్ వెజ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. వీకెండ్ కి ముందు చికెన్ ధరలు కొండెక్కాయి. వారం క్రితం తగ్గాయని సంబరాలు చేసుకున్న వాళ్లు ఇప్పుడు బోరు మంటున్నారు.

వీకెండ్ ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధర.. కిలో ఎంతంటే?

వేరే ప్రాంతాలు, అక్కడి ప్రజల సంగతి పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మాంసాహార ప్రియులే ఉంటారు. వాళ్లు దాదాపు వారంలో కనీసం రెండుసార్లు అయినా చికెన్, మటన్, చేపలు తినాల్సిందే. అయితే వీటిలో ఎక్కువగా చికెన్ తినేందుకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే మటన్ అంటే ఇప్పుడు సిటీలో రూ.1000 దాకా పలుకుతోంది. ఇంక చేపలు అంటే అందరికీ ఇష్టం ఉండదు. పైగా ముళ్లతో ఇబ్బంది ఉంటుందని లైట్ తీసుకుంటారు. ఇంక ఎక్కువ మందికి నచ్చే, మెచ్చే నాన్ వెజ్ అంటే చికెన్ అనే చెప్పాలి. అలాంటి చికెన్ ధరలు ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నాయి. వారం క్రితం ఉన్న ధరలకు ఇప్పుడు పెరిగిన ధరలు చూస్తే వినియోగదారులు షాకవుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భోజన ప్రియులే ఎక్కువగా ఉంటారు. వారిలో మరీ ముఖ్యంగా ముక్క లేనిదే ముక్క దిగని బ్యాచ్ చాలామందే ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు షాకింగ్ న్యూస్ అందింది. వీకెండ్ కి ముందు చికెన్ ధరలు చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. నిన్నమొన్న వరకు ధరలు తగ్గాయని సంబరాలు చేసుకున్నారు. కానీ, వారం కూడా తిరగక ముందే ధరలు మళ్లీ కొండెక్కాయి. గతంవారం చికెన్ స్కిన్ లెస్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. అలాగే స్కిన్ తో చికెన్ కిలో రూ.180 నుంచి రూ.200 వరకు ధర పలికింది.

ఇప్పుడు ఆ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇవాళ హైదరాబాద్ మార్కట్ లో బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ కిలో ధర రూ.260కు చేరిపోయింది. అలాగే స్కిన్ తో కిలో చికెన్ ధర ఇవాళ రూ.240గా ఉంది. ఈ ధరలు చూసిన నాన్ వెజ్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. ధరలు తగ్గాయి అని అనుకున్న వారంలోపే మళ్లీ ధరలు పెరిగాయి అని బాధ పడుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చికెన్ ధరలు ఇలాగే ఉన్నాయి. మరోవైపు కోడిగుడ్డు ధరలు చూస్తే.. మొన్నటి వరకు బాగా ఎక్కువగా ఉన్నాయి. కానీ, వారం నుంచి కోడిగుడ్డు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గుడ్డు ఒకటి రిటైల్ గా రూ.7 పలికిన స్థితి నుంచి రూ.5.50 నుంచి రూ.6కు చేరింది. ప్రస్తుతం గుడ్లు ధరల్లో మార్పులు లేవు అంటున్నారు. అయితే ఇంతకన్నా తగ్గుముఖం పట్టే ఆస్కారం మాత్రం లేదు అంటున్నారు.

మరోవైపు చికెన్ ధరలు ఇంతకన్నా కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మొన్న వారంలో కోళ్ల లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల చికెన్ ధరలు కాస్త తగ్గాయి. కానీ, ఎండలు ముదురుతున్న నేపథ్యంలో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు చికెన్ ధరలు ఇంక కొండెక్కడం మాత్రమే ఉంటుంది. తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెరిగిన ధరలు ఇంక తగ్గే ఛాన్స్ చాలా అరుదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వారంలోనే చికెన్ ధరలు పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.