iDreamPost
android-app
ios-app

తిరుపతి: ఇండియా ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో ఐటీ ఉద్యోగి మృతి

  • Published Nov 20, 2023 | 8:48 AM Updated Updated Nov 20, 2023 | 11:52 AM

ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలయ్యింది. ఈ ఫలితాన్ని ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈక్రమంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలయ్యింది. ఈ ఫలితాన్ని ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈక్రమంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Nov 20, 2023 | 8:48 AMUpdated Nov 20, 2023 | 11:52 AM
తిరుపతి: ఇండియా ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో ఐటీ ఉద్యోగి మృతి

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమి ప్రతి ఒక్కరిని కుంగదీసింది. ఇండియా ఓటమితో కోట్ల మంది అభిమానుల ఆశలు అడియాలసయ్యాయి. స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ చూస్తున్న వారే ​​కాక.. టీవీలు, ఫోన్లలో కూడా ఎంతో ఆసక్తిగా ఫైనల్‌ మ్యాచ్‌ని చూశారు జనాలు. ఈసారి ఇండియా ఎలాగైనా కప్పు కొడుతుందని ప్రతి ఒక్కరు నమ్మారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా.. ఓటమి పాలయ్యింది. అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్‌ చూస్తోన్న ఓ యువకుడు.. ఇండియా ఓటమిని తట్టుకోలేక అక్కడే కన్ను మూశాడు. భారత్‌ ఓడిపోవడాన్ని అతడి గుండె తట్టుకోలేక ఆగిపోయింది. దాంతో ఒక్కసారిగా అతడు కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర సంఘటన వివరాలు..

తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ అనే వ్యక్తి ప్రసుత్తం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ సందర్భంగా అతడు స్నేహితులతో కలిసి మ్యాచ్ చూస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో తీవ్ర నిరాశ చెందాడు. అయితే బౌరల్స్‌ మ్యాచ్ గెలిపిస్తారని ఆశపడ్డాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ చేజారుతుండటంతో జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

టీమిండియా ఓటమి తర్వాత ఇండియన్‌ ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి జ్యోతి కుమార్‌ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.