iDreamPost
android-app
ios-app

శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూలై కోటా టికెట్లు విడుదల ఆరోజే!

TTD Devotees: తిరుమ తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే సమాచారం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలానే తిరుమలకుసంబంధించిన సమాచారం టీటీడీ ఇస్తుంటుంది. తాజాగా జులై కోటా టికెట్ల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

TTD Devotees: తిరుమ తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే సమాచారం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలానే తిరుమలకుసంబంధించిన సమాచారం టీటీడీ ఇస్తుంటుంది. తాజాగా జులై కోటా టికెట్ల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూలై కోటా టికెట్లు విడుదల ఆరోజే!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అలానే టీటీడీ సైతం భక్తులకు సౌకర్యాలను కల్పిస్తుంది. తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యాలను మరింత మెరుగు పర్చేందుకు తరచూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అలానే దర్శనం, టికెట్ల జారీకి సంబంధించిన సమాచారం ఇస్తుంటుంది. తాజాగా శ్రీవారి అర్జిత సేవ టికెట్లకు సంబంధించి టీటీడీ కి కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తిరుమల  శ్రీవారిని దర్శించుకుని పరవశించిపోతుంటారు భక్తులు. ఇక ఎన్నో  ప్రయాసలు పడి..స్వామి వారిని దర్శనం చేసుకుని ఎంతో హాయిని పొందుతారు. శ్రీవారి దర్శనం కోసం చాలా మంది భక్తులు ముందుగానే టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటారు. శ్రీవారి దర్శనంకు సంబంధించిన వివిధ రకాల టికెట్ల జారీ విషయాన్నిటీటీడీ వెల్లడిస్తుంది. తాజాగా తిరుమల శ్రీవారి అర్జిత సేవ టికెట్లను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. జూలై నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది. ఏప్రిల్ 18న జూలై నెలకు సంబంధించిన అర్జిత సేవ టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ 18 గురువారం రోజు ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు  విడుదల చేయనుంది.

ఈ సేవా టికెట్ల కోసం ఏప్రిల్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు తీయనున్నారు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి తమ పేరు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అర్జిత సేవ టికెట్ల తో పాటు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా టీటీడీ విడుదల చేసింది. ఈ సేవ టికెట్ల ఏప్రిల్ 22 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 22న వర్చువల్ విధానంలో ఈ సేవల కోటా టికెట్లను విడుదల చేయనుంది.

టీటీడీ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. వాటిని కూడ ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు జారీ చేయనుంది. అదే విధంగా తిరుమ‌ల‌, తిరుప‌తిలో గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవ కోటా రిలీజ్ చేయనున్నారు. అదే రోజు న‌వ‌నీత సేవ కోటా కూడా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుదల చేయనున్నారు. ప‌ర‌కామ‌ణి సేవ కోటా ఏప్రిల్ 27 మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శ్రీవారి భక్తులు ఈ మేరకు టికెట్లు బుక్ చేసుకోవాలని కోరుతోంది.