iDreamPost
android-app
ios-app

టైమ్స్ నౌ ఈటీజీ సర్వే.. వైఎస్సార్సీపీదే ఘన విజయం

  • Published Dec 14, 2023 | 11:51 AM Updated Updated Dec 14, 2023 | 11:51 AM

సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రముఖ పత్రికా సంస్థలు, మీడియా సంస్థలు సర్వేలు జరుపుతుంటారు. కొన్నిసార్లు ఆ సర్వేలు కొన్ని నెంబర్ల తేడాలు తప్ప వారు చెప్పిందే నిజమవుతుంది.

సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రముఖ పత్రికా సంస్థలు, మీడియా సంస్థలు సర్వేలు జరుపుతుంటారు. కొన్నిసార్లు ఆ సర్వేలు కొన్ని నెంబర్ల తేడాలు తప్ప వారు చెప్పిందే నిజమవుతుంది.

  • Published Dec 14, 2023 | 11:51 AMUpdated Dec 14, 2023 | 11:51 AM
టైమ్స్ నౌ ఈటీజీ సర్వే.. వైఎస్సార్సీపీదే ఘన విజయం

తమకు అండగా ఉంటారని.. తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కరిస్తారని రాజకీయ నాయకులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు. కానీ ఆ నాయకులు మాత్రం పదవిలోకి వచ్చిన తర్వాత కనీసం కంటికి కూడా కనిపించని పరిస్థితిలో ఉంటారు. అలాంటి నాయకులకు ప్రజలు మరో ఎన్నికల్లో సరైన బుద్ది చెబుతుంటారు.  ప్రజల ఆకలి చూసి, కష్టాలను దూరం చేసి, కన్నీళ్లు తుడిచే నాయకులను గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు. దుష్ట రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఆత్మగౌరవంతో పథకాలు తీసుకునేలా పాలన కొనసాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మరోసారి ఆయనకే పట్టం కడతామని అంటున్నారు..ఇది పలు సర్వేల్లో వస్తున్న వార్తలు. తాజాగా ఏపీ ఎన్నికలపై మరో సర్వే ఫలితం సంచలన విషయాలు వెల్లడించింది. వార్తల్లోకి వెళితే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగనుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు సర్వేలు వెలువడ్డాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను 24 నుంచి 25 సీట్లను వైసీపీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది. ప్రజల మద్దతుతో ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొంది. ఫ్యాన్ గాలికి టీడీపీ, జనసేన, బీజేపీ తో పాటు ఇతర పార్టీలన్నీ కొట్టుకుపోవడం ఖాయం అని తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ గరిష్టంగా 1 సీటు, జనసేన, బీజేపీ కనీసం ఖాతా కూడా తెరిచే పరిస్థితిలో ఉండదని తెలిపింది.

ఈ మేరకు టైమ్స్ నౌ ఈజీటీ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్ లో ప్రసాచం చేయడంతో ఏపీలో రాజకీయంగా మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయని పలు సర్వేలు తెలిపాయి. వైఎస్ జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయం, మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఉద్యోగుల విషయంలో సానుకూలత ప్రదర్శిస్తున్నారు. తాము అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ‘గడ గడపకు మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ నేతలు ప్రతి గ్రామానికి వెళ్తూ అక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం వైసీపీ బలం మరింత పెరిగింది.. దీంతో 24 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని అంటున్నారు. కొన్ని సర్వేలు అయితే.. 25 సాధించి క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.