సాధారణంగా మన ఇంట్లో దొంగలు పడితే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దాంతో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని చోరీకి గురైన వస్తువులను దొంగల నుంచి రికవరీ చేసి మనకు అప్పగిస్తారు. మరి అలాంటి పోలీసులకే టోకరా వేశారు కిలాడీ దొంగలు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దొంగతనానికి పాల్పడ్డారు ఈ ఘరానా దొంగలు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విచిత్ర దొంగతనం సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కౌతాళం పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విచిత్ర చోరీ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభట నిలయంలోనే దొంగతనం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోసిగికి చెందిన కటిక షబ్బీర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు జూన్ 26వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి LED టీవీ, ఎలక్ట్రిక్ సామాన్లతో పాటు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే? పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసి ఉన్న బైక్ టైర్లు, సామాగ్రిని మార్చి.. వేరే వస్తువులను అమర్చారు దొంగలు.
ఈ క్రమంలోనే బైక్ ను విడిపించుకునేందుకు వచ్చిన బాధితుడు ఈ దృశ్యాలు చూసి అవాక్కైయ్యాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న బైక్ పార్ట్స్ ను ఎవరు దొంగలిస్తారని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇది ఇంటి దొంగల నిర్వాకమా? లేదా ఆకతాయిల పనా? అని స్థానికులు తెగ చర్చించుకుంటున్నారు. ఇక ఈ విచిత్ర దొంగతనం గురించి ఆ నోటా.. ఈ నోటా పడి పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో ఈ వార్త విని షాక్ కు గురవ్వడం వారి వంతైంది. ఇక ఈ సంఘటనపై నిఘా వర్గాల ద్వారా విచారణ చేపట్టారు పోలీసులు. మరి పోలీస్ స్టేషన్ లో ఉన్న బైక్ ల పార్ట్స్ దొంగలించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు.. ఆమె తండ్రి రావటంతో..