వీడియో: వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు!

వీడియో: వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు!

ఇటీవల గుండె పోటు కారణంగా మరణించే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి హర్ట్ స్ట్రోక్ కారణంగా అంతలోనే విగతజీవిగా మారుతున్నాడు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఒకప్పుడు గుండెపోటు అంటే బాగా వయస్సు మీద పడే వారికి మాత్రమే వచ్చేది. కానీ నేటికాలంలో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా..10నెలల పిల్లవాడి నుంచి పండు ముసలి వారి వరకు అందరికి వస్తుంది.  ఈ మహమ్మారి కారణంగా ఎందరో యువత మృత్యువాత పడుతున్నారు. సందడి వాతావరణంలో ఈ  గుండెపోటు విషాదం నింపుతోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం విషాదం చోటుచేసుకుంది. వినాయక మండపం దగ్గర డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ఆ యువకుడు మృతి చెందాడు.దీంతో ఆప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని మారుతి నగర్ లో వినాయకుడిని ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి పూజలు నిర్వహించిన అనంతరం.. మండపం వద్ద కొందరు యువకులు డ్యాన్స్ లు చేశారు. అలానే ప్రసాద్ అనే యువకుడు కూడా డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ  అందరిని అలరించాడు. మరో స్నేహితుడితో కలిసి ప్రసాద్ డ్యాన్స్  చేస్తూ సందడి చేశాడు. అయితే డ్యాన్స్ చేస్తూ ప్రసాద్ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. అలా ప్రసాద్ పడిపోవడంతో అక్కడి వారు విస్తుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడి ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేశారు.

ఆస్పత్రికి తరలించే లోపే ఆ యువకుడు మృతి చెందాడు. ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం ప్రసాద్ మృతదేహాన్ని ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటి వరకు తమ ముందు డ్యాన్స్ చేసి.. ఎంతో సందడి చేసిన ప్రసాద్.. విగత జీవిగా మారడం స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ప్రసాద్ మృతితో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి.. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు రావడానికి కారణలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments