Krishna Kowshik
మహాలక్ష్మి పథకం అమలు చేసిన నాటి నుండి బస్సుల్లో మహిళల కన్నా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు కండక్టర్లు. ఈ పథకం రాకముందు కూడా వీరికి సమస్యలు లేవా అంటే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి హైలెట్ అవుతున్నాయి. తాజాగా..
మహాలక్ష్మి పథకం అమలు చేసిన నాటి నుండి బస్సుల్లో మహిళల కన్నా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు కండక్టర్లు. ఈ పథకం రాకముందు కూడా వీరికి సమస్యలు లేవా అంటే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి హైలెట్ అవుతున్నాయి. తాజాగా..
Krishna Kowshik
తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. పథకం అమలు నాటి నుండి విశేష ఆదరణ పొందింది. మహిళలు,యువతులు ఫ్రీ జర్నీని వినియోగించుకుంటున్నారు. దీంతో రద్దీ పెరిగి పోయింది. బస్సులన్నీ మహిళా ప్యాసెంజర్లతో కిటకిటలాడుతున్నాయి. అదే సమయంలో పలు సమస్యలు వస్తున్నాయి. బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు మహిళలు, ఇతర ప్రయాణీకులు. పలు రూట్లలో బస్సుల కోసం గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే బస్సుల్లో సీట్లు దొరక్క.. కొన్ని కిలోమీటర్ల కాళ్లపైనే వెళ్లాల్సి వస్తుంది ప్రయాణీకులు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇక కండక్టర్ల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. రోజు ప్రయాణీకులతో ఓ చిన్న పాటి యుద్దమే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు మేం చేయలేకపోతున్నాం బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటున్నారు. ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు గుర్తింపు ఒరిజినల్ కార్డులు చూపిస్తేనే జీరో టికెట్ కొడుతున్నారు. కానీ కొంత మంది జిరాక్స్, సాఫ్ట్ కాపీలను సెల్ ఫోన్లలో చూపించి.. టికెట్ అడుగుతున్నారు. కండక్టర్ ఇవ్వనంటే.. వారిపై గొడవకు దిగుతున్నారు. నిన్న భద్రాచలం డిపోకు చెందిన బస్సులో కండక్టర్.. డోరు దగ్గర, మెట్లపైకి రావాలని మహిళా ప్రయాణీకులను కోరితే.. తిట్టిపోశారు. దీంతో ఆమె బస్సు దిగిపోయి కన్నీటి పర్యంతం అయ్యింది.
ఇప్పుడు ఓ మగ కండక్టర్.. చిన్న పిల్లవాడిలా ఏడుస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. కారణం.. ఆఫ్ టికెట్ కొట్టాల్సి వస్తుందని.. ఓ చిన్న పిల్లవాడిని శారీ కింద దాచి పెట్టింది. అయితే చెకింగ్ ఇన్ స్పెక్టర్ వచ్చే సరికి ఆ పిల్లవాడు కనిపించాడు. దీంతో ఆ మగ కండక్టర్ లబోదిబోమన్నాడు. ఆఫ్ టికెట్ తీసుకోవాల్సి వస్తుందని బాబును చీర కింద దాచేసిందంటూ.. తానేమీ చేయలేకపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అధికారులను చూడగానే ఆ కండ్టకర్ ‘మీ దణ్ణం పెడతా బాబూ.. మీరు పెద్ద మనస్సు చూసుకుని చూడండి.. మీరంటే మాకు భయం’ అంటూ ఏడ్చేశాడు. అధికారులు కూడా.. సర్లేరా బాబూ అంటూ అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. అయితే కండక్టర్, చెకింగ్ ఇన్ స్పెక్టర్ సంభాషణ చూస్తుంటే .. ఇది ఏపీలో జరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు. టికెట్ తీసుకోకుండా ప్రయాణించే సమయంలో చెకింగ్ ఇన్ స్పెక్టర్ తనిఖీలు చేస్తే.. టికెట్ తీసుకోని ప్రయాణీకుడు పట్టుబడితే.. అతడికి ఫైన్‌తో పాటు కండక్టర్ జాబ్స్ ఊస్టింగ్ అయిపోతాయి. కానీ కొంత మంది ప్రయాణీకులు చిన్న పిల్లల విషయంలో టికెట్ తీసుకోకుండా.. దాచి పెడుతుంటారు. ఇలాంటి పనులు చేసి వారు కండక్టర్ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. ఈ వీడియో చూస్తే.. అతడి పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది. మరీ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇంకేమేమో చూడాలో దేవుడా 🤣.. pic.twitter.com/v9gwTZQfea
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) December 28, 2023