APలో మరో రైలులో మంటలు.. ప్రయాణీకులు అప్రమత్తం కావడంతో

ఏపీలో వరుస రైలు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఇప్పుడు..

ఏపీలో వరుస రైలు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఇప్పుడు..

ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రైళ్లల్లో ప్రయాణించాలంటే భయాందోళన నెలకొంటుంది ప్రయాణీకుల్లో. గత ఏడాది ఒడిశా రైలు ప్రమాదాలు మిగిల్చిన విషాదం మర్చిపోక ముందే.. మరికొన్ని ఘటనలు వెలుగుచూశాయి. ఇటీవల దిబ్రూగర్ ఎక్స్ ప్రైస్ రైలు పట్టాలు తప్పడంతో పలువురు మృతి చెందారు. మొన్నటికి మొన్న విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. రైలులో ప్రయాణీకులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే తాజాగా పశ్చిమ బెంగాల్ మాల్దాలో, కర్ణాటక సరిహద్దులో ఉన్న దక్షిణ గోవాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలన్నీ మర్చిపోక ముందే మరో రైలులో మంటలు చెలరేగాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడకు బయలు దేరిన ధర్మవరం రైలు ప్రొద్దుటూరుకు రాగానే మంటలు చెలరేగాయి. ప్లాట్‌ఫామ్ మీదున్న రైలులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. ఈ మంటలు బోగి కింద నుండి మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. గమనించిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనై ట్రైన్ చెయిన్ లాగి తోటి ప్రయాణీకుల్ని అప్రమత్తం చేశారు. వెంటనే రైళ్లలో నుండి దిగిపోయారు. రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. కాగా, ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.

Show comments