iDreamPost
android-app
ios-app

మృత్యువు ఎదురుగా వస్తున్నా..జరగబోయే ప్రమాదాన్ని ఆపాలని ట్రాక్‌మెన్ తెగువ

  • Published Sep 08, 2024 | 4:22 PM Updated Updated Sep 08, 2024 | 4:22 PM

విధి నిర్వహణలో ఉన‍్న ఓ ట్రాక్‌మెన్‌ చూపిన సమయస్ఫూర్తి పెను ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. అంతేకాకుండా.. వందలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

విధి నిర్వహణలో ఉన‍్న ఓ ట్రాక్‌మెన్‌ చూపిన సమయస్ఫూర్తి పెను ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. అంతేకాకుండా.. వందలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 08, 2024 | 4:22 PMUpdated Sep 08, 2024 | 4:22 PM
మృత్యువు ఎదురుగా వస్తున్నా..జరగబోయే ప్రమాదాన్ని ఆపాలని ట్రాక్‌మెన్ తెగువ

ఈ మధ‍్యకాలంలో ఎక్కడ చూసిన రైలు ప్రమాదాలు అనేవి వరుసగా ప్రయాణికులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి.  కాగా, వాటిలో ఎక్కువగా రైలు పట్టాలు అదుపు తప్పడం, ఒకదానికొకటి ఢీ కొట్టం, రైల్లో మంటలు చెలరేగడం వంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో రైలు ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకొనేలోపే విధి నిర్వహనలో ఉన్న ట్రాక్‌మెన్‌ చూపిన తెగువ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

విధి నిర్వహణలో భాగంగా ఓ ట్రాక్‌మెన్‌ చూపిన సమయస్ఫూర్తి పెను ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. ముఖ్యంగా వందలాది మంది ప్రాణాలను కాపాడేలా చేసింది. అయితే ఈ సంఘటనలో రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాదేవ అనే ట్రాక్‌మెన్‌ తన విధుల్లో భాగంగా కొంకణ్‌ రైల్వే డివిజన్‌లోని కుమ్టా, హొన్నావర్‌ స్టేషన్‌ల మధ్య తనిఖీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున 4.50 గంటల ప్రాంతంలో ఓ చోట ట్రాక్‌  జాయింట్‌​ వద్ద వెల్డింగ్‌ అసంపూర్తిగా ఉన్నట్లు మహాదేవ గుర్తించాడు.

కానీ, అప్పటికే ఈ మార్గంలో  తిరువనంతపురం- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ శరవేగంగా దూసుకువస్తుంది. ఇది గమనించిన ఆ ట్రాక్‌మెన్‌ వెంటనే ల్వే స్టేషన్‌‌కు సమాచారం ఇచ్చాడు. అయితే.. అప్పటికే రైలు ఆ స్టేషన్‌ను దాటేయడంతో నేరుగా లోకో పైలట్‌ను అలర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నం కూడా పలించలేదు. దీంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. తనకేమైన పర్వాలేదు కానీ, జరగాల‍్సిన  ఘోరంను ఆపి, కొన్ని వందలాది ప్రజల ప్రాణాలు కాపాడాలని తెగువ చూపాడు. ఈ నేపథ్యంలోనే రైలును ఆపేందుకు పట్టాల వెంబడి రైలుకు ఎదురుగా పరుగులు పెట్టాడు.

కేవలం ఐదు నిమిషాల్లో అర కిలోమీటర్‌ మేర పరిగెత్తి..లోకోపైలట్‌కు పొంచి ఉన్న ప్రమాదం గురించి సిగ్నల్ అందించి, సకాలంలో రైలును ఆపివేయగలిగాడు. ఇకపోతే ట్రాక్‌  జాయింట్‌​ వద్ద వెల్డింగ్‌ పని పూర్తయిన అనంతరం.. రైలు తిరిగి యధావిధిగా బయలుదేరింది. అయితే ట్రాక్‌మెన్‌  చేసిన ఈ సహాసంపై రైల్వే అధికారులు, పలువురు ప్రశంసించారు.  ముఖ్యంగా తన ప్రాణాలకు తెగించి, వందలాది మంది ప్రాణాలు కాపాడాలనే అతని గొప్ప మనస్సుకు కొనియాడారు. అంతేకాకుండా.. ఆయనను సత్కరించి, రూ.15 వేల నగదు బహుమతిగా అందించారు. మరీ, తన ప్రాణాలను సైతంగా పనంగా పెట్టి వందలాది మంది ప్రాణాలను కాపాడిన ట్రాక్‌మెన్‌ మహాదేవ్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.