iDreamPost
android-app
ios-app

తప్పిన ఘోర రైలు ప్రమాదం.. నిన్న సిలిండర్- ఇవాళ సిమెంట్ దిమ్మె!

  • Published Sep 10, 2024 | 10:00 AM Updated Updated Sep 10, 2024 | 10:41 AM

Rajasthan Train Accident: నిన్ననే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి భారీ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు భారీ రైలు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Rajasthan Train Accident: నిన్ననే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి భారీ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు భారీ రైలు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 10, 2024 | 10:00 AMUpdated Sep 10, 2024 | 10:41 AM
తప్పిన ఘోర రైలు ప్రమాదం.. నిన్న సిలిండర్- ఇవాళ సిమెంట్ దిమ్మె!

గత కొన్ని రోజులుగా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ ప్రమదాలు అనేవి ఎక్కువగా రైలు పట్టాలు అదుపు తప్పడం, ఒకదానికొకటి ఢీ కొట్టం, రైల్లో మంటలు చెలరేగడం వంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాగా, వీటిలో కొన్ని సంకేతిక లోపలు తలెత్తడం వలన జరిగితే, మరి కొన్ని మానవ తప్పిదాల వలన కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్ననే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్ పై ఎల్పిజి సిలిండర్ ను పెట్టి భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి భారీ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు భారీ రైలు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రాజస్థాన్ లోని అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి గురయ్యే కుట్ర వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఫూలేరా-అహ్మదాబాద్ రూట్లలో వస్తున్న గుడ్స్ రైలుకు అడ్డంగా.. ట్రాక్ పై కొంతమంది దుండగులు 70kgs సిమెంట్ దిమ్మెను అడ్డంగా పెట్టారు. దీంతో ఆ గుడ్స్  రైలు సిమెంట్  దిమ్మెను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోగా.. ట్రైన్ ఇంజిన్ తో పాటు కొంతభాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటన సెప్టెంబర్ 8న రాత్రి 10:36 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో గూడ్స్ రైలు డ్రైవర్ ఈ విషయాన్ని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ హరి కిషన్ మీనాకు సమాచారం అందించాడు.

అదే విధంగా బంగర్ విలేజ్ స్టేషన్ సూపరింటెండెంట్ ఆదివారం రాత్రి 10:36 గంటలకు ఈ విషయాన్ని తెలియజేశారు. అనంతరం డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీసీ) ఉద్యోగులు రవి బుందేలా, విశ్వజిత్‌ దాస్‌లు పోలీసులుకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పరిశీలించి కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇకపోతే రైలు ఢీకొన్న ప్రదేశంలో ఆర్పీఎఫ్ సిమెంట్ ముక్కలను గుర్తించి, ఈ ఘటనపై మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్‌లో ఆర్పీఎఫ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

అయితే రాజస్థాన్ లో ఇలా రైలు పట్టాలు తప్పేందుకు చేస్తున్న కుట్రలు  నెల రోజుల వ్యవధిలో ఇది మూడోవరసారి అని రైల్వే అధికారులు తెలిపారు. కాగా,అంతకుముందు ఆగస్ట్ 23న అహ్మదాబాద్-జోధ్‌పూర్ వందే భారత్ ట్రాక్‌పై సిమెంట్ దిమ్మ పాలీ పెట్టాడంతో రైలు ఢీకొట్టిందని, ఆ తర్వాత 5 రోజుల వ్యవధిలో ఆగస్టు 28న బరాన్ లోని ఛబ్రాలో గూడ్స్ రైలు ట్రాక్‌పై బైక్‌ను విసిరివేశారని, మళ్లీ ఇప్పుడు ఇలా సిమెంట్ దిమ్మలను ట్రాక్ కు అడ్డంగా పెట్టారని తెలిపారు. అయితే ఇలా ప్రయాణికులు ప్రాణాలతో చెలగటమాడుతున్న దుండగులును వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులకు సూచించారు. మరీ, వరుస రైళ్లు ప్రమాదాలకు గురయ్యే విధంగా కుట్రలు చేస్తున్న ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet giriş