P Venkatesh
పరీక్షలు ప్రారంభమవుతున్నాయంటే చాలు విద్యార్థుల్లో టెన్షన్ మొదలవుతుంది. తీవ్ర ఒత్తిడిలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి చెందింది.
పరీక్షలు ప్రారంభమవుతున్నాయంటే చాలు విద్యార్థుల్లో టెన్షన్ మొదలవుతుంది. తీవ్ర ఒత్తిడిలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి చెందింది.
P Venkatesh
ఇరు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. విద్యార్ధి జీవితానికి టర్నింగ్ పాయింట్ టెన్త్ క్లాస్. పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తే ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుంది. టెన్త్ లో మంచి స్కోర్ రావాలని అటు పాఠశాల యజమాన్యాలు, ఇటు తల్లిదండ్రులు విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తుంటారు. స్పెషల్ క్లాస్ లు, తీరిక లేకుండా ప్రిపరేషన్ చేయించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతున్నది. తాజాగా టెన్త్ క్లాస్ విద్యార్థిని నిన్న పరీక్ష రాసిన అనంతరం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెపోటుకు గురై టెన్త్ విద్యార్థిని మృతి చెందింది.
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన వారు ఆకస్మాత్తుగా తుది శ్వాస విడుస్తున్నారు. కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొర్రపాడులో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. నిన్న పరీక్షకు హాజరైన బాలిక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తోటి విద్యార్థులతో మాట్లాడుతూ కుప్పకూలిపోయింది.
భయాందోళనకు గురైన విద్యార్థినులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్కూల్ యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆ విద్యార్థిని అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థిని లిఖిత మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గొప్ప చదువులు చదివి తమ కష్టాలను తీరుస్తుందని భావించిన తల్లిదండ్రులకు తీరని దుఖాన్ని మిగిల్చింది. విద్యార్థుల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడికి గురిచేయొద్దంటూ నిపుణులు సూచిస్తున్నారు.