అమెరికాలో ఇండియా పరువు తీసిన తెలుగు అమ్మాయిలు! ఏకంగా అరెస్ట్!

Telugu Girls Caught Shoplifting in USA ఒకప్పుడు అమెరికా వెళుతున్నామంటే ఓ రకమైన ఆనందం ఉండేది భారతీయులకు. కానీ నేటి రోజుల్లో ఆందోళన, భయం పట్టుకుంది. తాజాగా ఇద్దరు తెలుగు అమ్మాయిల్ని అమెరికా పోలీసులు పట్టుకున్నారు.

Telugu Girls Caught Shoplifting in USA ఒకప్పుడు అమెరికా వెళుతున్నామంటే ఓ రకమైన ఆనందం ఉండేది భారతీయులకు. కానీ నేటి రోజుల్లో ఆందోళన, భయం పట్టుకుంది. తాజాగా ఇద్దరు తెలుగు అమ్మాయిల్ని అమెరికా పోలీసులు పట్టుకున్నారు.

సరదాగా చేసే పనులు కొన్ని సార్లు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా షాపింగ్ చేసే సమయాల్లో చిన్న చిన్న వస్తువులు కొట్టేసి.. ఏదో మిగిల్చేసుకున్నాం అనుకుంటూ ఉంటారు. ఈ చిలిపి పనులు చెప్పుకోవడానికి బాగుంటాయి.. కానీ దొరికితే మాత్రం జీవితాంతం మాయని మచ్చగా మిగిలిపోతుంటాయి. తాజాగా అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు.. చిలిపి పనులు చేసి.. ఏకంగా తమ కెరీర్‌ను తమ చేతులతోనే కాలరాసుకున్నారు. అగ్రరాజ్యంలో డబ్బులు సేవ్ చేసేసుకున్నాం అనుకున్నారు కానీ భవిష్యత్తు నాశనం అవుతుందని ఊహించలేకపోయారు. ఆకతాయి పనులు చేస్తూ అమెరికా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్, గుంటూరు అని తెలుస్తోంది.

భవ్య శ్రీ లింగన గుంట, యామిని వకల పూడి అనే అమ్మాయిలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. మార్చి 19న జరిగిన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. స్టీవెన్ ఇన్ స్టిట్యూల్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేసేందుకు 2023లో వెళ్లిన ఈ ఇద్దరు అమ్మాయిలు.. మార్చి 19న సాయంత్రం 900 మాడిసన్ స్ట్రీట్‌లోని షాప్ రైట్‌లో షాపింగ్ చేసేందుకు వెళ్లి షాప్ లిఫ్టింగ్ చేశారు. షాప్ లిఫ్టింగ్ అంటే అదో రకమైన దొంగతనం, మోసం. వారు షాపింగ్ చేసి.. కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించారు. 27 వస్తువులు కొని.. కొన్నింటికి మాత్రమే బిల్లు వేయించుకున్నారు. 155. 61 డాలర్లకు గానూ కేవలం 8.74 డాలర్లు మాత్రమే చెల్లించారు. అయితే ఈ ఇద్దరు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్‌కు పాల్పడటాన్ని అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.

వెంటనే ఆ షాపింగ్ యాజమాన్యం హోబోకెన్ పోలీసులకు సమాచారం అందించింది. పాపులో దొంగతనానికి పాల్పడిన వీరిద్దరని పోలీసులు విచారణ చేపట్టి.. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు తొలుత బుకాయించి..  ఆ తర్వాత అదనంగా డబ్బులు చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చారు.  వీరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. పలు సెక్షన్ల కింద కేసులు బనాయించారు. ఈ ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. అయితే వీరు విడుదల అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ తెలుగు అమ్మాయిల అరెస్టు యూట్యూబ్‌లో వీడియోను రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త ఇండియా వ్యాప్తంగా దావనంలా వ్యాపిస్తోంది.  ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు గలీజు పని చేసి.. ఇండియా పరువు తీశారు. అలాగే భారతీయుల పట్ల అమెరికా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరోసారి చర్చకు వచ్చింది.

Show comments