SBI ATM: APలో వింత ఘటన.. ATMలో రూ.5 వేలు నొక్కితే రూ.7 వేలు వచ్చాయి!

APలో వింత ఘటన.. ATMలో రూ.5 వేలు నొక్కితే రూ.7 వేలు వచ్చాయి!

SBI ATM: తరచూ బ్యాంకింగ్ సెక్టర్ లో కొన్ని అనుహ్యమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. కొందరు కస్టమర్ల ఖాతాల్లో అనుకోకుండా కోట్లు వచ్చి పడుతుంటాయి. అలాంటి విచిత్రమైన ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

SBI ATM: తరచూ బ్యాంకింగ్ సెక్టర్ లో కొన్ని అనుహ్యమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. కొందరు కస్టమర్ల ఖాతాల్లో అనుకోకుండా కోట్లు వచ్చి పడుతుంటాయి. అలాంటి విచిత్రమైన ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

నేటికాలంలో డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్యంగా బాగా తగ్గింది. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే.. ఏటీఎం సెంటర్లకు పోయే వారి సంఖ్య కూడా తగ్గింది. చాలా వరకు ఆన్ లైన్ లోనే పేమెంట్స్ జరుగుతున్నాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఏటీఎంలకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునే వారు ఉన్నారు. ఇది ఇలాంటే.. కొన్ని సందర్భాల్లో సాంకేతిక సమస్య కారణంగా అనుకోకుండా వచ్చే అదనపు డబ్బులతో బ్యాంకుల కస్టమర్లు షాకి గురవుతుంటారు. ఏపీలోని ఓ ప్రాంతంలోని ఏటీఎంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. రూ.5 వేలు ట్రా చేస్తే.. రూ.7 వేలు వచ్చాయి.  ఈ విషయం స్థానికంగా వైరల్ కావడంతో ఆ ఏటీఎం వద్దకు జనం క్యూ కట్టారు. చివరకు ఏం జరిగిందంటే…

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. శనివారం తిరువూరు పట్టణంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి రూ.5వేలు నొక్కితే ఏకంగా రూ.7వేలు వచ్చాయి. దీంతో సదరు వ్యక్తి కాసేపు షాకి గురయ్యాడు. తాను డ్రా చేయాలనుకున్న అమౌంట్ కరెక్టేనా కాదా అనే సందేహం సైతం వ్యక్తం చేశారు. చివరకు అందులో తాము డ్రా చేయాలని అనుకున్న దాని కంటే అదనంగా డబ్బులు వస్తున్నట్లు గ్రహించారు.  ఇదే విషయం ఆ నోటా ఈ నోటా  తిరువూరు పట్టణం అంతటా వ్యాపించింది.

దీంతో కొందరు కస్టమర్లు అయితే ఏకండా డబ్బులు డ్రా చేసేందుకు ఆ  ఏటీఎం వైపు పరుగులు తీశారు.  పెద్ద సంఖ్యలో ఆ ఏటీఎం వద్ద జనం క్యూ కట్టారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఇక ఏటీఎం నుంచి అదనంగా డబ్బులు డ్రా అవుతున్న విషయాన్ని తిరువూరు పట్టణ పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బ్యాంకు అధికారులతో కలిసి  ఏటీఎం వద్దకు చేరుకున్నారు. కాసేపు ఆ ఏటీఎం ను మూసివేయించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఇలా జరిగిందని తెలుస్తోంది.

ఎస్బీఐ బ్యాంకు అధికారులు ఏటీఎంలో మరమ్మత్తులు చేసి మళ్లీ ఏటీఎంను ఓపెన్ చేశారు. మొత్తంగా ఏటీఎం నుంచి డ్రా చేయాల్సిన డబ్బుల కంటే ఎక్కువ రావడం…స్థానికంగా చర్చనీయాంశమైంది. బ్యాంకింగ్ సెక్టార్ లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. దాదాపు టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఈ తరహా విచిత్ర ఘటనలు జరుగుతాయి. గతంలో కొందరు కస్టమర్ల ఖాతాల్లోకి కోట్ల డబ్బులు డిపాజిట్ అయిన సంఘటనలు ఉన్నాయి. మరి.. తిరువూరులో జరిగిన ఈ విచిత్ర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments