iDreamPost
android-app
ios-app

దేశ రాజధానిలో టీడీపీ ఎంపీలకు భంగపాటు!

దేశ రాజధానిలో టీడీపీ ఎంపీలకు భంగపాటు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ అధికార, ప్రతిపక్షాలపై మాటల యుద్ధం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టే సంస్కరణలపై, పథకాలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. అయితే  అధికార వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రతిపక్షానికి గట్టి కౌంటర్ ఇస్తుంది. వైసీపీ ప్రభుత్వ పాలన గురించి కేంద్రంలో కూడా తెలపాలని టీడీపీ నేతలు తరచూ ప్రయత్నిస్తుంటారు.  ఈక్రమంలో టీడీపీ ఎంపీ తరచూ కేంద్ర మంత్రులను కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వారికి ఇలా ఫిర్యాదులుచేసే క్రమంలో భంగపాటు ఎదురయ్యేది. తాజాగా మరోసారి ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు భంగపాటు ఎదురైంది.

గురువారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు భంగాపాటు ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ  క్రమంలో వారు చేసిన ఫిర్యాదుల గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. ఆమె.. తన ఆఫీసు బయటే నిలబెట్టి టీడీపీ ఎంపీలు, సర్పంచులతో మాట్లాడి పంపించేశారు. తమ రాష్ట్రంలో ఆర్ధిక అవకతవకలు జరుగుతున్నాయని, వాటిపై మీరు దృష్టి పెంటాలంటూ వారు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈక్రమంలో ‘అలాగే చూద్దాం’ అంటూ  ఒక్క నిమిషంలో నిర్మలా సీతారామన్ ముగించారు.

నిన్ననే కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర పాటిల్ కూడా టీడీపీ ఎంపీలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పథకంలో చెల్లింపులు అన్ని ఆన్ లైన్ లో జరుగుతున్నప్పుడు అవకతవలకు అవకాశం లేదని మంత్రి అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు సమాధానం లేక టీడీపీ ఎంపీలు నోరెళ్ల బెట్టారు. ఆ ఘటన మరిచిపోక ముందే గురువారం మరోసారి భంగపాటుకు గురయ్యారు తెలుగు దేశం నేతలు. ఇలా టీడీపీ ఎంపీలు కేంద్రంలో ఏపీ పరువు తీస్తున్నారంటూ వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. టీడీపీ ఎంపీల చేస్తున్న పనులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీడీపీ ఆఫీస్‌లో ఆసక్తికర సీన్.. జై జగన్ అంటూ నినాదాలు!